Breaking News

వివిధ శాఖలకు చెందిన భవన నిర్మాణ పనులపై సమీక్ష…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి పనులు, ప్రాధాన్యత భవనాలు నిర్మాణం పనుల విషయంలో మరింత నిబద్దత ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం జే సి ఛాంబర్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో సి సి ఆర్ సి కార్డులు, పిఎం జె కె వై, పిడిఎస్ , రీ సర్వే, ఓ టి ఎస్, నీటి తీరువా, బి ఎమ్ సి యూ , మ్యూటేషన్, రెవెన్యూ అంశాలపై టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో వివిధ శాఖలకు చెందిన భవన నిర్మాణ పనులను చేపట్టడం జరుగుతున్న వారం వారం ప్రగతిపై అంశాల వారీగా ఉన్నతాధికారులు సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి శాఖ వారికి నిర్దేశించిన లక్ష్యాలలో కనీసం వచ్చే వారం సమీక్ష నాటికి 25 శాతం పురోగతి సాధించాలన్నారు. ప్రాధాన్యత భవన నిర్మాణం సమయంలోనే ఆయా పనులు పూర్తి చేసిన వెంటనే బిల్లులను అప్లోడ్ చేయాలి అని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ ఆర్ ఈ జీ ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను నిర్ణీత సమయం లో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేజ్ కన్వర్షన్ విషయంలో క్షేత్ర స్థాయి లో మరింత పురోగతి సాధించాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లాలో 114815 మంది రైతులు స్వంతం గా వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. మొత్తం జిల్లాలో కౌలు రైతులు 62196 మంది ఉండగా, వారిలో 53962 మందికి సి సి ఆర్ సి కార్డులు 89 శాతం జారీ చెయ్యడం జరిగిందని తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, (NFSA) కార్డు దారులకు బియ్యం పంపిణీ పై సమీక్ష నిర్వహించారు. పి ఎం జే కే వై బియ్యం ఆగస్ట్ 1వ తేదీ నుంచి 15 వరకు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *