Breaking News

బడి కోసం బస్సు యాత్రను జయప్రదం చేయండి…

-పాఠశాల విభజనను వ్యతిరేకిస్తూ జులై 25 నుండి 31 వ వరకు జరుగుతుంది.
-పాఠశాల పరిరక్షణ వేదిక పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగ సంస్కరణ పేరుతో పాఠశాల విభజన ఉపాధ్యాయ పోస్టుల కుదింపు చేస్తుందని వీటిని వ్యతిరేకంగా పిడిఎఫ్ ఎమ్మెల్సీలు,ప్రజాసంఘాలు కలిసి పలాస నుండి పెనుకొండ వరకు బడి కోసం బస్సు యాత్ర జులై 25 నుండి 31 వరకుచేస్తున్నామని తల్లితండ్రులు, ప్రభుత్వ విద్యారంగా శ్రేయోభిలాషులు బస్సు యాత్రను విజయవంతం చేయాలని పాఠశాలల పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది.

యుటిఎఫ్ విజయవాడ కార్యాలయంలో బస్సు యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిరక్షణ వేదిక నాయకులు మాట్లాడుతూ 75 సంవత్సరాల నుండి పునాది విద్యను అందించే ప్రాథమిక పాఠశాలలో విభజన చేయడం అలాగే అంగన్వాడి కేంద్రాలను బలహీనపరచడం తగదని విమర్శించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు మా బడి మా ఊర్లోనే ఉండాలని ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా విభజన చేయటం సరైన విధానం కాదని తెలిపారు విద్య హక్కు చట్టంలో గాని ఎన్ఈపి 2020 లో గాని లేని విలీనాన్ని ఎవరు ప్రయోజనాల కోసం చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పని భారం పెంచడం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడం నాణ్యమైన విద్యను అందించలేదని తెలిపారు జీవో నెంబరు 117 లో ఆసంబంధాలను సవరించాలని కోరిన, ఏదో ఒక సవరణ మాత్రమే చెందిన సమగ్ర సవరణ చేయాలని తెలిపారు మా పిల్లలను దూరం బడికి పంపమని తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనలో పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక అంగనవాడి పాఠశాలలో యధాతధంగా ఉండాలని సమాంతర మీడియం కొనసాగించాలని ఖాళీగా ఉన్న ఉపాధి పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పలాస నుండి జులై 25వ తేదీ పిడిఎఫ్ ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రమణ్యం, కేఎస్ .లక్ష్మణరావు, కె. శ్రీనివాసులు రెడ్డి, ఐ. వెంకటేశ్వరరావు, షేక్ బాబ్జి తో పాటు ప్రజా సంఘ నాయకులు బస్ యాత్రలో చేస్తున్నావని యాత్ర అన్ని జిల్లాల నుండి సాగుతూ సత్యసాయి జిల్లా పెనుగొండలో జులై 31 నాటికి ముగిస్తుందని తెలిపారు. ఈ యాత్రలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ కే లక్ష్మణరావు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కె ఎస్ ఎస్ ప్రసాద్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్నకుమార్ , ఎ.అశోక్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు ఎన్టీఆర్ జిల్లాయుటిఎఫ్ రాష్ట్ర ఏ కృష్ణ సుందర్ రావు, ప్రచురణ విభాగ చైర్మన్ ఎం హనుమంతరావు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *