విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు జగనన్న కాలని గృహనిర్మాణాలు అమ్మఒడి రేషన్ కార్డులు ఆధార్‌తో బ్యాంకు ఖాతా అనుసందానం వంటి నగర ప్రజల సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
సెంట్రల్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో కలెక్టర్ ఎస్ డిల్లీరావు శుక్రవారం ఆయన కార్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ సివిల్ సప్లయిస్ ఆర్‌అండ్ బి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగర ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమావేశంలో పాల్గొన్న సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ 225 జివో అమలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ పట్టాలకు సంబంధించి ప్రజలపై బారం పడకుండా నామ మాత్రపు రుసుముతో ఇళ్ల పట్టాలను రెగ్యులరైజ్‌షన్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాకిస్థాన్ కాలని, బర్మా కాలని, కాకాని నగర్, దేవినేని గాంధీపురం, వెంకటేశ్వరనగర్, గుణదల, ఊర్మిళా సుబ్బారావు నగర్, గాంధీజీ కాలని, అంబేద్కర్‌కాలని, పసుపుతోట, నరసరాజురోడ్డు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 4 వేల మందికి లబ్ది చేకూర్చేలా ఇళ్ల పట్టాల క్రమబద్దీకరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. గుణదల రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయడంలో న్యాయ పరమైన ఇబ్బందులను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మదురానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను మూడు మాసాలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఇందుకు అవసరమైన ఇసుక సిమెంట్‌ను ఎప్పటికప్పడు సరఫరా చేసేలా అధికారులను ఆదేశించాలని ఆయన సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసందానంలో జరిగిన పొరపాట్లు వలన సంక్షేమ పథకాలు పొందడంలో అర్హులైన లబ్దిదారులను కూడా అనర్హులుగా చూపిస్తున్నారని వీటిని సరిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్‌కార్డులలో మార్పులు చేర్పులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు అర్హులైన వారికి రేషన్‌కార్డులు మంజూరు చేసి ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరిగేలా చూడాలని శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ సమావేశం దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ 225 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇళ్ల పట్టాల క్రమబద్దీకరించేందుకు ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అయితే నామ మాత్రపు రుసుము వసూలు చేసే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రభుత్వం నిర్థేశించిన నామ మాత్రపు ధర పై క్రమబద్దీకరించేలా చర్యలు తీసుకుంటానన్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్ మిస్ మాచింగ్ విషయంలో ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ఎవరికైతే మిస్ మాచింగ్ జరిగిందో అటువంటి వారికి తిరిగి ఆధార్ అనుసందాన ప్రక్రియను పూర్తి చేసి అరులైన ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇతర సంక్షేమ పథకాల లబ్దిని చేకూరుస్తామన్నారు. జగనన్న కాలనీలలో గృహా నిర్మాణాలు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. మూడవ దశ కింద జగనన్న కాలనీల కొరకు భూసేకరణ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని లబ్దిదారుల గృహ నిర్మాణాలకు భూమిని సేకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రజల సమస్యల పరిష్కారం పై సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారులతో బేటి:
నగర ప్రజల ఇళ్ళ పట్టాల క్రమబద్దీకరణ ఇళ్ల స్థలాలు గృహా నిర్మాణం వంటి ప్రధాన సమస్యలపై చర్చించేందుకు విజయవాడ సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమీషనర్, సంబంధిత అధికారులతో సోమవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేశారని శాసనసభ్యులు మల్లాదివిష్ణు తెలిపారు. సమావేశంలో సమస్యలపై పూర్తి స్థాయిలో సమీక్షించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మల్లాదివిష్ణువర్థన్ తెలిపారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, సెంట్రల్ తహాశీల్థార్ వి శ్రీనివాస్‌రావు, నార్త్ తహాశీల్థార్ దుర్గప్రసాద్, రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ తదితర శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.