Breaking News

పేద ప్రజల గుండె చప్పుడు డా. వై యస్ రాజశేఖర్ రెడ్డి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత మహానేత ముఖ్యమంత్రి డా. వై యస్ రాజశేఖర్ రెడ్డి  13 వ వర్థంతి సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 59వ డివిజన్లో సింగినగర్ డాబాకోట్ల సెంటర్ వద్ద 59 వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ. షాహీన సుల్తాన హఫీజుల్లా  ఆధ్వర్యంలో దివంగత ముఖ్య మంత్రి డా. వై.యస్.రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు ఎండీ. రుహుల్లా మరియు 59 వ డివిజన్ కార్పొరేటర్ ఎండీ. షాహీన సుల్తాన హఫీజుల్లా విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఆలిం మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, రాజశేఖర్ రెడ్డి అభిమానులు వేలాది మంది కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పండ్లు పంపిణీ చేయడం జరిగింది.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *