-ఇంటికి దీపం ఇల్లాలు.. మహిళలకు మంచి చెయ్యాలనే సంకల్పం తో వారి పేరునే అన్నీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం…
-రాష్ట్ర హోం మంత్రి డా. తానే టి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు పేద వర్గాల ప్రజలకు అందించే విధం గా సిఎం ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత అన్నారు. గురువారం కొవ్వూరు మండలం కాపవరం గ్రామం లో వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హోం మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జిల్లాలో 88, 356 మందికి 3వ విడత ద్వారా ₹.165.67 కోట్ల మేర వై ఎస్ ఆర్. చేయూత పథకం ద్వారా లబ్ది చేకూరుతొందన్నారు. అన్నీ వర్గాలను, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని, పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలు ఆయా పేద, నిరుపేదల కుటుంబాల , మహిళల ఆర్థిక సాధికారత కోసం నవరత్నాలు పధకములను, గత మూడు సంవత్సరాలుగా వైఎస్ఆర్ చేయూత ను అమలు చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, కరోనా విపత్తు వచ్చి ఆదాయ వనరులు లేక పోయినా ఋణ మాఫి, సున్నా వడ్డీ పధకాలు, వై.ఎస్.ఆర్. చేయూత వంటి పధకాలు అమలు చేస్తున్నామని మంత్రి వనిత అన్నారు. వై ఎస్ ఆర్ చేయూత” పధకం ద్వారా జీవనోపాధిని ప్రోత్సహించడం లో భాగంగా రిటైల్ వ్యాపార రంగంలో ఉన్న అర్హులైన పేద నిరుపేద మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపడం జరుగుతోందన్నారు. నేడు వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం తో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయి కు చేరుకో గలిగారు అంటే జగనన్న కి వారిపై ఉన్న నమ్మకం కారణం అన్నారు. ఇంటికి దీపం ఇల్లాలు, నానుడిని సార్థకం చేసే విధానం లో జగనన్న సంకల్పం తో నేడు రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా మన్నారు. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల లోని 45-60 సంవత్సరాలు మధ్య ఉండే వారికి రూ.165.67 కోట్ల ప్రయోజనం పొందగలిగారన్నా రు. నిర్దుష్టమైన జీవనోపాధి కోసం ఈ మొత్తాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ మహిళల ఆర్థిక వెనుక బడిన వర్గాల వారికి కుల మత, ప్రాంత, రాజకీ యాలకి అతీతంగా అర్హులకు అందించడం జరిగిందన్నారు.
కొవ్వూరు నియోజకవర్గం లో చాగల్లు మండలంలోని 3577 మంది లబ్ధిదారులకు రు.6,71 కోట్లు, కొవ్వూరు మండలంలోని 4833మంది లబ్ధిదారులకు రు.9.06 కోట్లు, తాళ్లపూడి మండలం లోని 2578 మంది లబ్ధిదారులకు రు.4.83 కోట్లు, రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని మంత్రి తానేటి వనిత అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కుల, మత, పార్టీ, రాజకీయాలనే భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, 60 సంవత్సరాలు నిండితే పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా చేయూత కాపు నేస్తం, రైతు భరోసా, పేదలకు ఇళ్ల స్థలాలు ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలు రథసారథులని చేయూత పధకం ద్వారా మహిళలకు ఆర్థి క సహాయం తో పాటు ఆయా కుటుంబాల జీవనోపాధికి తోడ్పాటు అందిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ. యం. సి. చైర్మన్, వల్లభ శెట్టి శ్రీనివాస్, యం. పి. పి. కాకర్ల సత్యనా రాయణ, జిల్లా పరిషత్ వైస్ ఛైర్ పర్శన్ పోసిన శ్రీ లేఖ, డిఆర్డిఏ, పి. డి., ఎస్. డేగ లయ్య, జెడ్పిటిసి బొంతా వెంకట లక్ష్మి, సర్పంచ్ సుంకర పద్మిని, యంపిడిఓ, కుమార్, మండల తాహిసీల్దార్ బి. నాగరాజు నాయక్, స్థానిక నాయకులు సుంకర సత్యనారాయణ, బండి పట్టాభి రామారావు, పలువురు సర్పంచ్ లు, యం. పి. టి. సి. లు వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.