విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు 56వ డివిజన్ రాజరాజేశ్వర పేట నందు రైల్వే స్థలాలలో ఇళ్ళు నిర్మించుకున్న పేద ప్రజలు ఇళ్ళను తీసివేయడానికి రైల్వే శాఖ వారు స్థానికులకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపధ్యంలో పశ్చిమ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయరు, NTR జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఆధ్వర్యములో రైల్వేశాఖ వారి నుండి 9 ఎకరాలు భూమిని సర్వే చేసి అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇవ్వడానికి రైల్వే అధికారులతో చర్చ జరిగినది. ప్రజలను అక్కడే ఉండడానికి కలెక్టర్ మరియు MLA గారు హామీ ఇచ్చారు. పై అధికారులతో చర్చించి ఈ విషయములో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమములో NTR జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, స్థానిక కార్పొరేటరు యలకల చలపతి రావు మరియు రైల్వే అధికారులతో కలిసి పాల్గొనడం జరిగినది.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …