-తక్షణ సహాయం కింద 15000 ఆర్ధిక సహాయం అందచేసిన వెలంపల్లి
-అన్ని విధాలా ప్రభుత్వ పరంగా అండగా వుంటాం అని హామీ ఇచ్చిన వెలంపల్లి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక 50వ డివిజన్ గొల్లపాలెంగట్టు ఆలేటి వారి వీధి కొండా ప్రాంతంలో నివసించే కూచిపూడి లుధియా వజరమ్మ, పైడిముక్కల సరళ,కూచిపూడి రవికుమార్ ల ఇల్లులు సోమవారం నాడు దీపావళి పండుగ కావడంతో అది పూరి గుడిసె కావున అగ్ని ప్రమాదానికి గురైంది అయితే అది తెలుసుకున్నా మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు అక్కడకు వెళ్లి ఇల్లును పరామర్శించి వారిని ఓదార్చి తక్షణ సహాయం కింద తలకో 5000 రూపాయలు మొత్తం 15000 ఆర్ధిక సహాయం అందచేశారు.ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బంక విజయ,బంక శివ, డివిజన్ పార్టీ నాయకులూ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.