విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 47వ డివిజన్ లోని పుచ్చలపల్లి లీలా సుందరయ్య మునిసిపల్ ప్రాధమిక పాఠశాల నందు నాడు నేడు కార్యక్రమము లో భాగం గా శనివారం సుమారు రూ.6.00 లక్షల, వ్యయంతో నూతనముగా నిర్మించే అదనపు తరగతుల పనుల శంకుస్థాపన మరియు తదుపరి 47వ డివిజన్ లోని కె.యల్ రావు నగర్ నందు 4,5 & 8 సందులలో దాదాపు రూ.26.00 లక్షలు వి.యం.సి జనరల్ ఫండ్స్ నిధులతో సి.సి. రోడ్లు మరియు సైడ్ డ్రైన్లు మరమ్మత్తుల పనుల శంకుస్థాపన కార్యక్రమములో పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు వేలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ గోదావరి గంగా, మరియు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలతో కలిసి పాల్గొనడం జరిగింది. అదే విధంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటలో నగరపాలక సంస్థ అనేక కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమములకు శంకుస్థాపన చేయుట జరిగిందని, అభివృద్ధి చేయుటకు పనులు సత్వరమే చేపట్టి వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని అన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …