విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, మాచవరంలోని ప్రముఖ దాసాంజనేయ స్వామి గుడి ఎదురుగా టూ వీలర్స్ వాహనదారులకు అందుబాటులోకి శ్రీ మణి ఆటో కన్సల్టెన్సీ, శ్రీ మణి బైక్ మెకానిక్ వర్క్స్ ప్రారంభించారు. గురువారం ప్రారంభించబడిన ఈ సందర్భంగా నిర్వాహకులు జె. శివ గంగాధర్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకముల, అన్ని కంపెనీల ద్విచక్ర వాహనాలు కొనడంతోపాటు అమ్మకాలు కూడా జరుగుతాయని తెలిపారు. సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలు అందుబాటు ధరలలో కండిషన్లో ఉన్న మంచి వాహనాలు కస్టమర్లకు అందజేస్తామన్నారు. అంతేకాకుండా ఈ వాహనాల కొనుగోలుకు స్పాట్ ఫైనాన్స్ ఇప్పించే సౌకర్యాన్ని కూడా కల్పిస్తామన్నారు. వీటితోపాటు మా వద్ద అన్ని రకముల ద్విచక్ర వాహనాలకు అనుభవజ్ఞులైన మెకానికల్ ద్వారా రిపేరు సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఈ ఫీల్డ్ లో తమకు 30 సంవత్సరాలు అనుభవం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …