-ఎన్నికల అధికారిగా యం రాజాబాబు నియామకం… జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ గన్నవరం తాలూకా యూనిట్ పదవీకాలం ముగియడంతో తాలూకా యూనిట్ ఎన్నికలు నిర్వహించుటకు సన్నాహాలు మొదలుపెట్టారు. విజయవాడ, నవంబర్ 10, స్థానిక గాంధినగర్ లోని ఏపీ ఎన్జీవోస్ హోమ్ నందు గురువారం నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గన్నవరం తాలూకా యూనిట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించుటకు ఎన్నికల బృందాన్ని నియమించడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడు యం రాజుబాబును ఎన్నికల అధికారిగా, కంకిపాడు తాలూకా యూనిట్ అధ్యక్షుడు యువి పురుషోత్తమరాజుని సహాయ ఎన్నికల అధికారిగా, జిల్లా సంయుక్త కార్యదర్శి విశ్వనాధంను ఎన్నికల పర్యవేక్షకులుగా నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించాలని, అవకతవకలకు తావులేకుండా సజావుగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగెల చూడాలని అన్నారు. గన్నవరం తాలూకా యూనిటుకు సంబంధించిన ఉద్యోగుల ఓటర్ జాబితాను ఎన్నికల బృందానికి అందజేశారు. అధికార ఉత్తర్వులను యం రాజుబాబుకు, యువి పురుషోత్తమరాజుకు, విశ్వనాధంకు, జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్, అందజేశారు. వీరితో పాటుగా జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణ, సతీష్ కుమార్, మధుసూదనరావు,సీవీఆర్ ప్రసాద్ ఉన్నారు.