విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుదవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ 9 మరియు 11 సచివాలయాలకు మంజూరు అయిన 40లక్షల రూపాయల నిధులతో స్థానిక ప్రజల కోరిక మేరకు నూతనంగా నిర్మిస్తున్న కామినేని నగర్ బీ.టీ రోడ్, నాగార్జున నగర్ సీ.సీ రోడ్డు నిర్మాణ పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పూజ కార్యక్రమాలు నిర్వహించి వీలైనంత త్వరగా ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు అవినాష్ సూచించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ
పరిపాలన ను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ను ప్రవేశపెట్టడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో సచివాలయానికి 20లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ప్రజలు తెలిపిన సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని అన్నారు.గత ప్రభుత్వం మాదిరిగా వైసీపీ ప్రభుత్వం కేవలం శంకుస్థాపన లకు పరిమితం కాకుండా వెనువెంటనే పనులు ప్రారంభించి ఎలాంటి నాణ్యత లోపం లేకుండా త్వరగా పూర్తి చేస్తున్నామని,ఆ మేరకు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే ఈ డివిజిన్లో కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి కాలనీలలో అంతరగత రోడ్లు, పార్కు ల నిర్మాణలు పూర్తి చేయడం జరిగిందని, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ప్రతి పనిని వీలైనంత త్వరగా పూర్తి చేసి డివిజిన్ ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. అభివృద్ధి తో సమానంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వనిదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, కో-ఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైస్సార్సీపీ నాయకులు గౌస్, కోటిరెడ్డి, భీమిశెట్టి నాని, పూర్ణ, సుబ్బారావు, కృష్ణ రావు, కనక దుర్గా నగర్ కాలనీ ప్రెసిడెంట్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …