గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు హక్కు కలిగిన ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండేలా క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది పనిచేయాలని తూర్పు గోదావరి జిల్లా ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్” డా.పి.భాస్కర స్పష్టం చేశారు. బుధవారం గోపాలపురం నియోజక వర్గం దేవరపల్లి , మండలం లోని పోలింగ్ బూత్ 66 ను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పి. భాస్కర ఆ పోలింగ్ కేంద్రం పరిధి లోని ఓటర్ల జాబితా, ఇతర ఫారాలను తనిఖీ చేసి, వాటి నమోదు, ఓటరు గుర్తింపు కార్డు ఆధార్ అనుసంధానం తదితర అంశాలపై బి ఎల్ వో ల నుంచి సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల స్వీకరణ వ్యవధి 09.11.2022 నుండి 8.12.2022 వరకు ఇవ్వడం జరిగిందని, ఆలోగా క్లైమ్స్ పరిష్కరించాలన్నారు. తదుపరి క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరించేందుకు డిసెంబర్ 12 నుంచి 26 వరకు, బి ఎల్ ఓ ల ద్వారా వర్కింగ్ కాపీని ధృవీకరించే సమయంలో/ సప్లిమెంట్‌ల ప్రింటింగ్ మరియు రోల్ చివరి ప్రచురణ కు డిసెంబర్ 27 నుంచి 2023 జనవరి 4 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఓటరు నమోదు కార్యక్రమం అత్యంత పారదర్శకం గా చేపట్టాలని ఆదేశించారు. ఈ భాద్యతలను నిర్వహించడం లో బూత్ లెవల్ అధికారి విధులు అత్యంత కీలకం అన్నారు. ఈ సందర్శన లో ఆర్డీవో ఎస్. మల్లిబాబు, తహశీల్దార్ రవీంద్రనాథ్, బి ఎల్ ఓ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …