Breaking News

స్పై-హై సాంకేతికతతో 75 సక్సెస్ ఫుల్ సర్జరీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగించి మణిపాల్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. సుమారు 75కు పై బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. వి.ధర్మేంద్ర కుమార్ మాట్లాడారు. బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీకి సంబంధించి రోగి శరీరంలోని రక్త ప్రవాహాన్ని విజువలైజ్ చేసుకోగలిగిన సామ ర్థ్యాన్ని తమ వద్ద ఉన్న స్పై-హై సాంకేతికత ఇస్తుందని తెలిపారు. దీనితో క్యాన్సర్ బారి నుంచి ఎన్నో ప్రాణాలను కాపాడే వీలున్నట్లు పేర్కొన్నారు. ఈ సాంకేతికత కారణంగా ఆపరేషన్ టేబుల్ పై మరింత అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు కేవలం విదేశాలకు మాత్రమే పరిమితం అయిన ఈ సాంకేతికత విజయవాడకు తీసుకురావడం గర్వకారణమని మరో వైద్యులు డా. దినేశ్ రెడ్డి తెలిపారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *