Breaking News

నాడు – నేడు ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం… : మంత్రి జోగి రమేష్

కృత్తివెన్ను, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చేందుకు మన బడి నాడు– నేడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కొనియాడారు.
బుధవారం ఉదయం ఆయన పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన బడి నాడు – నేడు 2 వ ఫేజ్ లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన నాలుగు ఆదనపు తరగతి గదుల నిర్మాణం కొరకు 88 లక్షల 98 వేల 685 రూపాయల వ్యయంతో జరగనున్న పనులకు భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చే లక్ష్యంతో రెండో విడత పనులు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. పాఠశాల తల్లిదండ్రుల కమిటీలు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలతో కూడిన బ్యాంకు అకౌంటులో ప్రభుత్వం నాడు–నేడు రివాల్వింగ్‌ ఫండ్‌ విడుదల చేస్తున్నారన్నారు.ఈ ఫండ్‌తో అభివృద్ధి పనులు శరవేగంగా నేడు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయని ఆయన చెప్పారు. నాడు–నేడు మొదటి విడతలో పని చేసిన అనుభవం ఉన్న ఎంఈఓ, ఏఈ, హెచ్‌ఎంలు, పేరెంట్‌ కమిటీల సభ్యులు, సిఆర్పీలు, ఎమ్మార్సీలో పని చేస్తున్న ఎంఐఎస్, ఎల్డీఏ, మండల లెవెల్‌ అకౌంటెంట్స్‌తో పాటు మిగిలిన సిబ్బంది, సచివాలయంలో పని చేస్తున్న ఇంజినీరింగ్‌ సిబ్బందితో రెండో విడత పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసేందుకు యంత్రాంగం సన్నద్ధమైందని మంత్రి జోగి రమేష్ సభలో విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. బాల బాలికలు శ్రద్దగా చదువుకోవాలని తద్వారా ఉన్నతస్థాయికి చేరుకోవలన్నారు.
తొలుత ఆయన కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామం నుంచి చిన పాండ్రాక గ్రామాల మధ్య 5.6 కిలోమీటర్ల మేర 1 కోటి 17 లక్షల రూపాయల ఓ.ఎన్.జీ.సి నిధుల వ్యయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న పక్కా బీటీ రోడ్డుకి జరుగు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను సర్పంచ్ పెదసింగు మోకమ్మ, కృత్తివెన్ను మండల పార్టీ అధ్యక్షులు వైదాని వెంకట రాజు, కృత్తివెన్ను జడ్పిటిసి మైలా రత్నకుమారి, ఎంపీపీ కూనసాని గరుడా ప్రసాద్, కృత్తివెన్ను ఎంపీటీసీ చింతా వడ్డీ కాసులు, ఎంపీడీవో జి. పిచ్చబాబు, డిప్యూటీ తాసిల్దార్ శశికుమార్, ప్రధానోపాధ్యాయురాలు సి హెచ్ శ్రీవాణి, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామాని అరుణతో పాటు ఆర్కే విక్రమ్ రాజు, ఎద్దు చంద్రశేఖర్, ఎస్ సునీల్ గవాస్కర్, నాగార్జున తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *