విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాబార్డ్, వ్యవసాయ, అనుబంధ రంగాలు, సహకార శాఖ అధికారులతో నగరంలోని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వారు పండిరచిన ఉత్పత్తులను మధ్యవర్తులు, దళారిలు వ్యవస్థ లేకుండా నేరుగా వ్యాపారాలు నిర్వహించుకునే విధంగా సభ్యులకు అవకాశం వుంటుందన్నారు. సభ్యులుగా ఎఫ్‌పివోలో చేరి, రిజిస్ట్రరైన రైతు గ్రూపులకు 5 సంవత్సరాల వరకు 25 లక్షల రూపాయల వరకు రుణాలను పొందవచ్చునన్నారు. కనీసం 300 మంది రైతులు ఎఫ్‌పివోలో సభ్యులుగా ఉండాలన్నారు. నాబార్డ్, చిన్న రైతుల అగ్రిబిజినెస్ కన్సార్టియం (ఎస్‌ఎఫ్‌ఏసి), నేషనల్ కోఆపరేటివ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సిడిసి)లు అమలు ఏజెన్సీలుగా వ్యవహరిస్తారన్నారు. ఇప్పటికే నాబార్డ్ సంస్థ అమలు ఏజెన్సీగా జగ్గయ్యపేట, జి. కొండూరు, మైలవరం మండలాలలో ఎఫ్‌పివోలు కంపెనీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రర్ అవడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చంద్రర్లపాడు మండలంలో మిరప, కంచికచర్ల మండలంలో శనగ, నందిగామ మండలంలో పత్తి, మిరప, విజయవాడ రూరల్ మండలంలో మామిడి పంట రైతులకు సంబంధించి ఎఫ్‌పివోల ఏర్పాటు ప్రతిపాదనలను సమావేశంలో ఆమోధించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ తెలిపారు.సమావేశంలో నాబార్డ్ ఏజియం మిళింద్ చౌసాల్క్‌ర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యం. విజయభారతి,జిల్లా సహకార శాఖ అధికారి సిహెచ్ శైలజ, కోఅపరేటివ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ధర్మరావు, ఉద్యాన శాఖ అధికారి ఏడి బాలజీ కుమార్, పశు సంవర్థక శాఖ అధికారి కె. విద్యా సాగర్, ఏపియంఐపి పిడి సుభాని, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి ఎస్ సత్యనారాయణ, మార్క్‌ఫడ్ జిల్లా మేనేజర్ నాగ మల్లిక తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …