Breaking News

వీర జవాన్లకు వందనం సమర్పించి, వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు సాయుధ దళాల పతాక దినోత్సవం !!

-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వీర జవాన్లకు వందనం సమర్పించేందుకు వారి కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు సాయుధ దళాల పతాక దినోత్సవ ముఖ్య ఉద్దేశమని కృష్ణాజిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. బుధవారం ఆయన కలెక్టర్ బంగ్లాలో సాయుధ దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సైనిక సంక్షేమ అధికారిణి సర్జన్ లెఫ్టినెంట్ కమాండర్ కళ్యాణ వీణ.కె ( రిటైర్డ్ ) కలెక్టర్ కు పతాక నిధి జెండాను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని సైనికులకు, మాజీ సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత సైనిక దళాలు, మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాలపై దేశం గర్విస్తోందని, పాకిస్థాన్‌, చైనా యుద్ధ సమయాల్లో, కార్గిల్‌ యుద్ధంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో సైనికుల ధైర్య సాహసాలు, తెగువకు జాతి యావత్తు గర్విస్తోందన్నారు. సాయుధ దళాల నిధికి ఆయన తన తొలి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ, సాయుధ దళాలు దేశరక్షణ కొరకు అహర్నిశలు చేస్తున్న కృషి, శత్రువుల బారినుండి దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ, వారి కుటుంబాలకు మనము అండగా నిలబడాల్సిన ముఖ్యమైన రోజని అన్నారు ఎంతో మంది సైనికులు దేశ రక్షణలో తమ ప్రాణాలు తృణప్రాయింగా అర్పించారన్నారు. మనందరి రక్షణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన సైనికుల కోసం ఈ పతాక పతాక నిధికి అధికారులు, ఉద్యోగులు, ప్రజలు విరివిగా విరాళాలు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ సభ్యులు, మచిలీపట్నం సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు గాడెల్లి వసంతరావు, ముఖ్య కార్యదర్శి శరత్ బాబు, కార్యనిర్వహణ కార్యదర్శి ఎన్. వాల్టర్స్ , వై. లక్ష్మణ రావు, జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *