Breaking News

పతాక నిధికి విరాళాలు అందించి సైనిక కుటుంబాన్ని ఆదుకోండి… : జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రక్షణకు ప్రాణాలను అర్పించిన సైనిక కుటుంబాలను ఆదుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పతాక నిధికి విరివిగా విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవం (ఫ్లాగ్‌డే) పురస్కరించుకుని బుధవారం స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సాయుధ దళాల పతాక నిధికి విరాళం అందించి జిల్లా సైనిక సంక్షేమ అధికారి నుండి పతాకాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ దేశ రక్షణ కొరకు పోరాడి ఆసువులుబాసిన సైనికుల కుటుంబ సభ్యులకు సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ గౌరవాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో ధైర్యంగా పోరాడి వీరమరణం పొందిన సైనికులకు నివాళులర్పించి వారి కుటుంబాలకు అండగా నిలిచే సంకల్పంతో 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 7వ తేదిన సాయిధ దళాల పతాక దినోత్సవాన్ని పాటిస్తున్నామన్నారు. భారత సైనికులు మొక్కవోని దీక్షతో చూపుతున్న దేశభక్తి సాహసం త్యాగాల పట్ల దేశం గర్విస్తుందన్నారు. పాకిస్తాన్‌ చైనాలతో జరిగిన యుద్దం సమయంలో కార్గిల్‌ పోరాటం ముంబై తాజ్‌ హోటల్‌ దురాక్రమణ వంటి సంఘటనలలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు భారత జవానుల ధైర్యసహసాలు తెగువకు జాతి యావత్తు గర్విస్తుందన్నారు. ఆయా సమయాలలో ఎంతో మంది జవానులు వీరమరణం పొందరన్నారు. మనం స్వేచ్చంగా జీవిచగలుగుతునామంటే అందుకు కారణం భారత సైనికుల రక్షణే కారణమన్నారు. దేశ రక్షణలో పాటుపాడుతున్న ప్రతి సైనికునికి మనం ఎంతో రుణపడి ఉన్నామన్నారు. వారి రుణం తీర్చుకునే అవకాశం పతాక దినోత్సం కల్పించిందన్నారు. వీర మరణం పొందిన సైనికుల తల్లిదండ్రులు, వితంతువు అయిన భార్య పిల్లలకు మనకు తోచిన రీతిలో స్పందించి విరాళాలు అందించడం ద్వారా కొంత మేరకు లోటు తీర్చగలిగే అవకాశం ఉందని కలెక్టర్‌ పేర్కొన్నారు. స్వచ్చందంగా విరాళాలు అందించేందుకు ముందుకు వచ్చేవారు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ జిల్లా సైనిక సంక్షేమ అధికారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్యాంక్‌ ఖాతా 62067742138 ఐఎఫ్‌ఎస్సి కోడ్‌ ఎస్‌బిఐఎన్‌ 0020899 ద్వారా నేరుగా తమ విరాళాలు అందించవచ్చునని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
జిల్లా సైనిక సంక్షేమ అధికార సర్జస్‌ లెఫ్టనెంట్‌ కమాండర్‌ కె. కళ్యాణ వీణ మాట్లాడుతూ సరిహద్దు ఉగ్రవాదం, తిరుగుబాటులను ఎదుర్కొవడంతో మన సాయిధ దళాలు తమ విలువైన ప్రాణాలను కోల్పోతూ ఉంటారన్నారు. చిన్న వయసులో సాయుధ రంగంలో చేరతారన్నారు. యుద్ద సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, వికలాంగులైన వారి సంరక్షణకు సామాజంలో ప్రతి ఒక్కరూ ఇతోదిక సహాయం అందిస్తే గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు అండగా ఉన్నట్లుఅవుతుందన్నారు. గుండె జబ్బులు క్యాన్సర్‌ జాయింట్‌ రీప్లే స్మెంట్‌ వంటి తీవ్రమైన వ్యాధులతో బాదపడుతూ అధికంగా చికిత్స చేయించుకోలేని మాజీ సైనికులకు ఈ విరాళం ద్వారా సహాయం అందించే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
నగరానికి చెందిన పారిశ్రామిక వేత్త సాగి కృష్ణంరాజు మూడు లక్షల రూపాయలు, కెనరా బ్యాంక్‌ రీజనల్‌ ఆఫీసు విజయవాడ వారు ఒక లక్ష యాబై వేల రూపాయలు, పరుచూరి వెంకట కృష్ణారావు యాబై ఐదు రూపాయలు, రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌ వై కాళీ వరప్రసాద్‌ శర్మ ఇరవై ఐదు వేల రూపాయలు చెక్కుల రూపంలో జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.
కార్యక్రమంలో మాజీ సైనిక సంక్షేమ సంఘము సభ్యులు మేరి స్టేల్లా, దుర్గమల్లేశ్వర మహిళ కళాశాల, నలంద కళాశాలకు చెందిన ఎస్‌సిసి విధ్యార్థులు, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *