విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో భాగంగా భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా రీ సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. జగనన్న శాశ్వత భూ హక్క భూ రక్ష పథకంలో భూ రికార్డుల క్షేత్రస్థాయి ప్రక్షాళనలో భాగంగా గ్రామాలలో చేపట్టే భూ సర్వే ప్రక్రియకు మండల స్థాయిలో నియమించబడిన ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ (టివోటి)లు, తహాశీల్థార్లు ఎంపిడివోలు, సర్వే అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ డ్రోన్‌ఫ్లై పూర్తిఅయిన చోట క్షేత్రస్థాయిలో భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని సిసిఎల్‌ఏ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారన్నారు. దీనిలో భాగంగా జిల్లాలో 32 మంది డిప్యూటి తహాశీల్థార్లు, గ్రామ సర్వేయర్లకు ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. శిక్షణ పూర్తి అయిన మండల ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్, ఆయా మండలాలలోని సర్వే చేపట్టవలసిన గ్రామాలలో విఆర్‌వో, గ్రామ సెక్రటరీ, అగ్రికల్చర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్‌లతో కూడిన గ్రామ స్థాయి టీమ్‌లకు శిక్షణ అంధించాలని కలెక్టర్ ఆదేశించారు. భవిష్యత్‌లో భూ వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా భూ హక్కు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, ఏడి సర్వే కె. సూర్యారావు, కలెక్టరేట్ ఏవో ఇంతియాజ్ పాషా ఉన్నారు.
Prajavartha Online Telugu News