Breaking News

అందరివాడు కనమర్లపూడి దామోదర్…

మనసున్న మారాజు కనమర్లపూడి దామోదర్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
సామాజికవేత్త, వైసిపి నాయకులు, సాయి పురం కాలని ప్రెసిడెంట్, ఆర్యవైశ్య సేవా సంఘం గొల్లపూడి వ్యవస్థాపక అధ్యక్షులు, నిరంతరం ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తూ…. ఆర్యవైశ్య సంఘానికి మరో పేరుగా, రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న కనమర్లపూడి దామోదర్ 13వ తేదీ స్వర్గస్తులైన సందర్భంగా 23వ తేదీ చివరి రోజున ముగిసిన కార్యక్రమానికి పలువురు నగర ప్రముఖులు, పండితులు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు సభ్యులు, సాయి పురం కాలనీ, గొల్లపూడి, వన్ టౌన్ తదితర ప్రాంతాల నుండి అనేక మంది హాజరై ఘన నివాళులు అర్పించి దామోదర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి పురం కాలనీ, గొల్లపూడిలో ఏ ఇంట్లోనైనా,ఏ మిత్రుడు ఇంట్లోనైనా శుభకార్యమైనా, అశుభకార్య మైన… నేనున్నానంటూ ప్రత్యక్షంగా మిత్రులతో హాజరై, స్నేహపూర్వకమైన వాతావరణ కల్పిస్తూ, ఆటు అధికారులను ఇటు ప్రజలతో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి కనమర్లపూడి దామోదర్ అని అన్నారు. ముఖ్యంగా సాయి పురం కాలనీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. పండుగలకు పబ్బాలకు చిన్న పెద్దలను ఒకచోట చేర్చి మానసికోల్లాసానికి వివిధ రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి పోటీలు పెట్టి వారినందరినీ ఉత్తేజపరిచే వారన్నారు. ఎన్నో ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాలు, ఎండాకాలంలో మజ్జిగ పంపిణీ, చదువుకునే పేద పిల్లలకు ప్లేట్లు గ్లాసులు పంపిణీ, ఎన్నో గుప్తదానాలు, మరెన్నో దైవ కార్యక్రమాలు చేసి, ఎంతో మంది విద్యార్థులకు చదువుకునేందుకు ఫీజులు ఆర్థిక సహాయం చేసిన మనసున్న మంచి మనిషి మన కనమర్లపూడి దామోదర్ అని అన్నారు. సాయి పురం కాలని ప్రెసిడెంట్ గా అందరికీ నోట్లో నాలుకలా, అందరి వాడిలా మెలిగిన ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన చూపిన బాటలో కాలనీ అభివృద్ధికి అందరూ కృషి చేసి సాయి పురం కాలనీ మోడల్ కాలనీ గా తీర్చిదిద్ది ఆయన కోరిక నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గవర్నర్ దూళిపాళ్ల రత్న బాబు, రోటరీ సభ్యులు, సాయి పురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు తడవర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, సంఘ సభ్యులు, పంచాయతీ సభ్యులు, సాయి పురం కాలనీవాసులు సత్యనారాయణ, సురేష్ ఎల్ఐసి, వెంకటేశ్వరరావు, రెడ్డి తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

సమాజ సేవలో స్వచ్ఛంధ సంస్థలు భాగస్వామ్యం కావాలి

-కలక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం కలెక్టరేట్ లో “మదర్ థెరీసా చారిటబుల్ సొసైటి”, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *