Breaking News

ఏక వినియోగ ప్లాస్టిక్ తొల‌గించ‌డానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది !!

-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
త‌క్కువ వినియోగ యోగ్య‌త‌, అధిక ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌తికూల స్వ‌భావం క‌లిగిన ఏక వినియోగ ప్లాస్టిక్ ను క్ర‌మ‌క్ర‌మంగా వినియోగం నుంచి తొల‌గించ‌డానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉన్న‌ద‌ని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ప్రకటించారు.
బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ చాంబర్లో జరిగిన కాలుష్య నియంత్రణ మండలి సమావేశంలో కలెక్టర్ పాల్గొని జిల్లా ప్రజలు కాలుష్యానికి గురికాకుండా తీసుకోవాల్సిన చర్యల పై కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, మునిసిపల్ తదితర శాఖల అధికారులతో చర్చించారు.
ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ కృష్ణాజిల్లాలో పర్యటించనున్నారని, ఆ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక ప్రిపరేటరీ మీటింగ్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మాట్లాడుతూ, ప్లాస్టిక్ 20వ శ‌తాబ్దికి చెందిన ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన ఆవిష్కరణ అయిన‌ప్ప‌టికీ, సేక‌రించ‌కుండా వ‌దిలివేసే ప్లాస్టిక్ ప‌ర్యావ‌ర‌ణానికి తీవ్ర‌మైన ముప్పుగా మారింద‌ని ఆయ‌న వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26వ తేదీ నుంచి ఫ్లెక్సీల ముద్రణ నిషేధం గూర్చి ప్రచారం ఏ మేరకు చేస్తున్నారని కాలుష్యం నియంత్రణ మండలి అధికారులను కలెక్టర్ ప్రశ్నించారు.
జిల్లాలోని వివిధ పంచాయతీలలో ఇంటింటికి చెత్త సేకరణ అంశం మీద నోట్స్ సిద్ధం చేసుకుని సంబంధిత ఫోటోలు వీడియో క్లిప్పింగ్స్ తో సంసిద్ధులై ఉండాలని డిపిఓ నాగేశ్వర్ నాయక్ కు కలెక్టర్ ఆదేశించారు.
వినియోగించ‌కుండా వ‌దిలివేసే ప్లాస్టిక్ భూగోళానికి, జ‌ల‌వ‌న‌రుల‌కు క‌లిగిస్తున్న ప్ర‌తికూల ప్ర‌భావాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఏక వినియోగ ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వం కూడా ప్లాస్టిక్ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌కు స‌మ‌ర్థ‌వంత‌మైన చ‌ర్య‌లు జిల్లావ్యాప్తంగా తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు కృష్ణాజిల్లలో వాతావరణ కాలుష్యం జరగకుండా ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్‌ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఈఈ టి. ప్రసాదరావు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వెంకట్రావు, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, ఉయ్యూరు, మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు, పెడన మున్సిపల్ కమిషనర్ అంజయ్య, గుడివాడ పెనమలూరు, తాడిగడప మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *