-చంద్రమౌళి వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బహుజనులకు రాజ్యాధికారం, కుల నిర్మూలన, పేదవర్గాలకు ఆర్ధిక వెసులుబాటు, అభివృద్ది లక్ష్యంగా నవసమాజ్ పార్టీ ఏర్పడిందని ఆ పార్టీ వ్యవస్థాపకులు, జాతీయ అధ్యక్షులు ఊదరగొండి చంద్రమౌళి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరల సమావేశం లో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ గత ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేసిందని, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ హింసా ప్రవృత్తిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తూ, పలువురి మరణాలకు కారణము అవుతున్నందువలన ఆ పార్టీ గుర్తింపు రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్ కు లేఖ ద్వారా తెలియజేసినట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీ పాదయాత్ర లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వేలాది మంది కిక్కిరిసిన జన సందోహం మధ్య సాగుతోందని అన్నారు. సభలు, సమావేశాలు, పాదయాత్రలు ఎవరైనా చేసుకొనే స్వేచ్చ ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని ఊదరగొండి చంద్రమౌళి పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ , వంట గ్యాస్ పై పెంచిన అదనపు సుంఖం ఎత్తి వేయాలని నవ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తోందని వెల్లడించారు. వై.యస్.ఆర్.సి.పి. ప్రభుత్వం ముఖ్యమంత్రి వై. యస్. జగన్మోహనరెడ్డి చేస్తున్న అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలు తమ పార్టీ ఆశయాలకు దగ్గరగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో మెజారిటీ వర్గాలైన యస్.సి., యస్.టి., బి.సి., మైనారిటీలలో అవగాహన కల్పిస్తామని, పార్టీ, కుల, మత, ప్రాంతీయ రహితంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న జగన్ ప్రభుత్వం రాష్ట్రములో 24 లో కూడా అధికారం లోకి తమ వంతు కర్తవ్యాన్ని నవసమాజ్ పార్టీ నిర్వహిస్తున్నదని తెలియజేశారు. యస్ సి ల సంక్షేమానికి గతములో అమలు అవుతున్న 27 పధకాలు. ఎత్తి వేసినందుకు గాను, వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా మరికొన్ని పధకాలు అమలు చేయాలని కోరామని తెలిపారు. జగన్ ప్రభుత్వం మాత్రమే రాష్ట్రం లో పేదలకు సామాజిక న్యాయం కల్పిస్తూ, వాలంటీర్ ల వ్యవస్థ ద్వారా ఇంటి దగ్గరకి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు సచివాలయాల ద్వారా పారదర్శకముగ అందిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని మరోసారి బలపరచాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. కార్యక్రమంలో పలువురు నవసమాజ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.