Breaking News

గుడివాడలో ఘనంగా యువ ఉత్సవ్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర విజయవాడ అధ్వర్యంలో స్థానిక VK VNRB & AGK ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో కృష్ణాజిల్లా స్థాయి యువ ఉత్సవ్ ఇండియా @ 2047 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యమానికి గుడివాడ DSP పి. శ్రీకాంత్ ముఖ్య అతిథిగాను జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్  ఫణి ధూర్జటి గౌరవ అతిధి గాను విచ్చేశారు. భారత మాత చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఈ సందర్భంగా నిర్వహించిన పెయింటింగ్ పోయెట్రీ ఫోటోగ్రఫీ డిక్లమేషన్ మరియు బృంద నృత్యం విభాగాలలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు మోడీఏ 20 అనే పుస్తకాన్ని బహుమతులుగా అందజేశారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించిన భారత వానికి రాబోయే శతజయంతి స్వాతంత్ర దినోత్సవానికి అడుగులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు అమృత కాల్ పంచప్రాన్ అనే థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముదావహం అని యువత విద్యా పరంగా ఎంత ఎదిగిన వ్యక్తిగతంగా వారు తమ లో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను ప్రదర్శించి అన్ని రంగాల్లో రాణించాలని రాబోయే 25 సంవత్సరాలు కాలం భారతావానికి అత్యంత కీలకమని ప్రతి యువతీ యువకుడు తమ వంతు బాధ్యతగా దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మరొక గౌరవ అతిధి ఫణి ధూర్జటి గారు మాట్లాడుతూ యువతీ యువకులు తరతమ భేదాలు మరిచి వారి యొక్క ఇష్టమైన రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో రాణించి వారి బంగారు భవితను తీర్చిదిద్దుకోవాలని వారి భవితే భారత భవితని , కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్థం చేసుకొని ఎంపిక చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ రమేష్ చంద్ర  కళాశాల ప్రిన్సిపల్ డా. SHV ప్రసాద్ గారు, నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి సుంకర రాము ఆర్ సెటి డైరెక్టరు విజయ భారతి గారు రెడ్ క్రాస్ ఛైర్మన్ టి యస్ యస్ భాలజి, సెక్రెటరీ బి శంకర్ నాథ్  దూర దర్శన్ ప్రోగ్రాం డివిజన్ అ‌రుణ కుమారి శ్రీ కృష్ణ దేవరాయలు యూత్ బీమల వినోద్‌కుమార్  పాల్గొన్నారు. భారతీయ యువశక్తి ట్రస్ట్ KVIC, FPO, PBS Blood Donation cell ఆర్ సెటి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మఛిలిపట్నం వారి ద్వారా విద్యార్థుల అవగాహన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది వివిధ కళాశాల నుంచి పోటీ నిమిత్తం విచ్చేసి పాల్గొన్న 800 మంది పైగా యువతీ యువకులు యువజన సంఘ సభ్యులు నేషనల్ యూత్ వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జాతీయ గీతాలపన తో ఈ కార్యక్రమం ముగిసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *