-కేసలి అప్పారావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పూర్తి స్థాయిలో బాల్య వివాహాలు నిర్మూలనలో మహిళా పోలీస్ సిబ్బంది కీలకంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నిన్న ( 14-06-2023) విడుదల చేసిన జీ ఓ.నంబర్ : 31 లో గ్రామ మరియు వార్డ్ స్థాయి మహిళా పోలీస్ సిబ్బందికి విస్తృత మైన అధికారాలు ఇస్తూ గ్రామ మరియు వార్డ్ స్థాయిలో బాల్య వివాహాలు నిర్మూలన కమిటీలో కన్వీనర్ గా నియమిస్తూ మార్గదర్శక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయి లో కలెక్టర్లు,డివిజన్ స్థాయి లో ఆర్డీవోలు మండల స్థాయిలో సీడిపిఓలు ను ఈ కమిటీలను పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తారని తెలిపారు.వీరితో పాటు ఆయా మండలాలకు సంబందించి తహశీల్దార్లు, పోలీసు అధికారులు,విద్యా శాఖ అధికారులు,మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు,మున్సిపల్ అధికారులు,మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది,అంగన్వాడి సిబ్బంది మరియు ఉపాధ్యాయ సిబ్బంది తో కలిసి ఈ బాల్య వివాహాలు నిర్మూలన కోసం రూపొందించ బడిన చట్టాన్ని కఠీనంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
చైర్మన్ అప్పారావు మాట్లాడుతూ మహిళా పోలీస్ సిబ్బంది అయా ప్రాంతాల్లో గల సచివాలయం సిబ్బంది ,అంగన్వాడి సిబ్బంది, ప్రజా ప్రతినిదులు మరియు వాలంటీర్లు సహాయ సహకారం తీసుకొని గ్రామ మరియు వార్డ్ స్థాయి లో బాల్య వివాహాలు మీద అవగాహన కల్పించి వీటిని రూపుమాపాలని కోరారు .
రాష్ట్రాన్ని బాల్య వివాహాలు రహిత రాష్ట్రంగా తీర్చి దిద్ధాలని కోరారు.