-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి చెందుతున్న సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ లోని ఇన్ఫర్మేషన్ పార్కు ను శుక్రవారం నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్లాంట్లు నందు ఆధునికీకరణ పనులను పరిశీలించి అక్కడ జరుగుతున్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. ఈ పార్కులో ఏర్పాటు చేసిన ఆడిటోరియం ను పరిశీలించి, పార్కులో ఏర్పాటు చేసే గ్రీనరీని ఎప్పుడు వాడే గ్రీనరి కాకుండా హెర్బల్ మరియు జోడైక్ గార్డెన్ సంబంధించిన గ్రీనరి పెట్టాలని ఆదేశించారు. అర్బన్ గ్రీనరి అండ్ బ్యూటీఫికేషెన్ సిబ్బంది పలు డిజైన్ కమీషనర్ ముందు ఉంచగా కమీషనర్ మార్పులు చెప్పి తగు సూచనలు చేసారు.
విజయవాడ నగరవాసులకు అభివృద్ధితోపాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు వీఎంసీ, ప్రణాళికబద్ధంగా పార్కులను అభివృద్ధి చేస్తోందని, శివారుప్రాంత వాసులకు అందుబాటులో అజిత్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ లోని ఇన్ఫర్మేషన్ పార్కు మరియు ఐకానిక్ పార్కు వీఎంసీ అభివృద్ధి చేస్తోందని, వీటిలో ఐకానిక్ ప్లాజా పార్కుల్లో ఓపెన్ జిమ్, బ్యాడ్మింటన్, ఫాస్ట్ ట్రాక్స్ లను ఏర్పాటు చేయడం జరుగుతుంది .
ఈ పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, , శానిటరీ ఇన్స్ పెక్టర్లు, గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషెన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.