-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నడిబొడ్డున అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “125” అడుగుల అంబేడ్కర్ స్మృతి వనాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో స్పెషల్ సీ.ఎస్. వై శ్రీలక్ష్మి ఐఏఎస్ పర్యవేక్షణలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వపనిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో అంబెడ్కర్ స్మృతి వనము పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘసంస్కర్త, అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం ఎంత కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం భారతదేశంలో నాల్గవ ఎత్తైన విగ్రహం మరియు ప్రపంచంలోని 40 ఎతైన విగ్రహాలలో ఒకటి. నగరంలోని స్వరాజ్ మైదానంలో నిర్మాణం జరుపుకుంటున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం స్మృతి వనం పనులను మంగళవారం నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పు౦డ్కర్ ఐ.ఏ.ఎస్. అధికారులతో కలిసి పరిశీలించారు. అంబేడ్కర్ స్మృతి వనంలో లోపల జరుగుతున్నముజియం. సీలింగ్, ప్లాస్టింగ్ పనులను పరిశీలించి ఎటువంటి పొరపాట్లు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగవంతంగా చేయాలనీ, పనుల నాణ్యతా ప్రమాణాలను క్వాలిటీ కంట్రోల్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తి చేశామని పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు.