రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సామాజిక సమత సంకల్ప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి , ఆమేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించడం లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదేశించారు.
మంగళవారం ఉదయం కలెక్టరేట్ నుంచి ఆడుదాం ఆంధ్ర, ఎన్నికలు, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, కిసాన్, పశు కిసాన్ క్రెడిట్ కార్డులు, రీ సర్వే, రెవెన్యూ సంస్కరణలు & పునఃసమీక్ష , అంగన్‌వాడీల సమ్మె స్థితి, ఉపాధి హామీలో అమృత్ సరోవర్ ట్యాంకుల గుర్తింపు, సామాజిక సమత సంకల్ప (జన్ భగీదారి ప్రీ-లాంచ్) కార్యకలాపాలపై జిల్లా, డివిజన్, మండల, సచివాలయ స్థాయి అధికారులకు, సిబ్బంది కి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ, జనవరి 19 వ తేదీ విజయవాడ లో డా బిఆర్ అంబేడ్కర్ విగ్రహం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 512 సచివాలయాల ముందస్తు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి సచివాలయం లో డా బి ఆర్ అంబేద్కర్ ఫోటో ఏర్పాటు చేసి ఘన నివాళి అర్పించాల్సి ఉందన్నారు. సచివాలయం ఆవరణ లో ఫ్లెక్సీ ఏర్పాటు, ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు వారి పేర్లు నమోదు చేయాల్సి ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క స్ఫూర్తి ని భవిష్యత్తు తరాలకు అందించటానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, ప్రతి ఒక్క సచివాలయం లో ఫోటోల, ఫ్లెక్సీ ఏర్పాటు చేసి సచివాలయం యొక్క వివరాలు వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలన్నారు.
ఓటరు నమోదు కార్యక్రమం లో భాగంగా పారదర్శకత తో ఓటరు జాబితా ప్రక్రియను సజావుగా సిద్దం చెయ్యడం జరుగుతోందని తేజ్ భరత్ అన్నారు. 18 ప్లస్ యువ ఓటర్లు, దివ్యాంగ ఓటర్లు పేర్లు నమోదు పెద్ద ఎత్తున పూర్తి చెయ్యాల్సి ఉంటుందన్నారు. పది మంది కి పైగా 712 మంది ఓటర్లు ఉన్న 63 ఇంటి చిరునామాలో 514 మందిని గుర్తించామని, మరో 168 మంది నుంచి ఫారాలు స్వీకరించామని, 28 మందిని గుర్తించాల్సి ఉందన్నారు. జీరో జంక్ పేర్లు 14 ఓట్లు ఇంకా పరిష్కారం చెయ్యాల్సి ఉన్నాయని అన్నారు. వైయస్ఆర్ హెల్త్ కార్డ్ 86,277 మందికి గాను 4674 మందికి అందచేసామన్నారు.
రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు కింద 1,04,640 మంది రైతులకు రూ. 2526 కోట్ల రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా రూ.1805 కోట్లు (71.04%) లక్ష్యాలను సాధించడం జరిగిందన్నారు. కిసాన్ పాల వెల్లువ క్రెడిట్ కార్డులు 3299 మందిలో 2169 మందికి రుణాలు మంజూరు చేశారని అన్నారు. మిగిలిన వారికి బ్యాంకర్స్ రుణాలు మంజూరు చేయాలని కోరారు.
రీ సర్వే లో భాగంగా 75,452 సర్వే రాళ్ళు ఏర్పాటు చేయాల్సి ఉండగా 19116 (25 .4 %) పూర్తి చేసినట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకం కింద 48 లక్షల పనిదినాలకు గానూ 43.43 లక్షలు సాధించినట్లు తెలిపారు. ఎంపీడీఓ లు మిగిలిన పని దినాలు కోసం పనులు గుర్తించి అప్లోడ్ చెయ్యాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డి ఆర్వో జి. నరసింహులు, డి ఎ వో ఎస్. మాధవరావు, ఐ సి డి ఎస్ పిడి కె. విజయ కుమారి, డి ఎ హెచ్ వో ఎస్ జీ టి సత్య గోవింద్, ఎ డి సర్వే ఎమ్. జ్యోత్సుల , డి ఏల్ డివో పి. వీణా దేవి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News