విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో సోమవారం (04.03.2024) ఉదయం 10: 00 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 9.45 గంటలకు స్పందన కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్, మండల, గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలోనూ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ అర్జీలను గ్రామ,వార్డు సచివాలయం, మండల, డివిజన్ స్థాయిలోనూ సమర్పించ వచ్చునని కలెక్టర్ డిల్లీ రావు ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …