Breaking News

మసక బారిన ప్రతిష్టను వెలుగులోకి తేవాలి

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
గత 5ఏదేళ్ళ ప్రభుత్వకాలం లో తెనాలి పట్టణం ఏ అభివృథ్థికి నోచుకోక పోగా మరింతగా దిగజారిందని తెనాలి జనసేన అభ్యర్ఠి నాధెండ్లమనోహర్ అన్నారు. ఆదివారం స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ కార్యాలయంలో ఉదయం వాకర్ల సమావేశంలోఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈక్లబ్ లో తన కంటే ఉన్నత విద్య అభ్యసించిన మేథావులున్నారని గత పాలనలో ఏమేరకు నష్టపోయామో గ్రహించాలని యువత ఉపాథి లేక విరివిగా లభ్యతయ్యే గంజాయికి అలవాటుపడ్డారని, ఇసుక అక్రమార్జనతో బేల్దారు పనుల్లేక వివిథ రాష్ట్రాలకు వలస బాట పట్టారని ఇక రైతు కు10 పంట కాలలలో(ఖరీఫ్+ రబీ) జరిగిన నష్టం పొలం అమ్మి పూడ్చుకుందాం అంటే ఎకరా కోటి విలువైన భూమిని కొల్లిపరలో 25వేలకు అడుగుతున్నారన్నారు,సీనియర్లు మేథావులు ఈవిషయంలో సామాన్యులకు అవగాహన పెంచి చైతన్య పరచాలన్నారు,

తెనాలి మౌళిక వసతుల కల్పన లేదని పెదరావూరు-నందివెలుగు రోడ్డును లోకేష్ తో మాట్లాడి విజయవాడ ప్రథాన రహదారిలో తాను కలిపే ప్రయత్నం చేస్తానని ఐతానగర్ లో మంచి పార్కు విజయవాడ గుంటూరు కు దీటుగా తెనాలి ని అభివృథ్థి చేస్తానని అన్నారు,

అంతకు ముందు జరిగిన సమావేశంలో ఉపిరితిత్తుల వ్యాదికి సంబంథించి యేగా తో నివారించవచ్చని వైద్యనిపుణులు తెలిపారు. ఈ సమావేశంలో Dr.పాటిబండ్ల దక్షిణామూర్తి విద్యావేత్త గుత్తా వేంకటరత్నం కడియాల రవిబాబు లు మాట్లాడుతూ ప్రస్తుత పాలనతో రాష్ట్రం చాల నష్టపోయిన విషయం గుర్తు చేశారు, తెనాలిలోని వివిథ వాకర్స్ క్లబ్ సభ్యు సీనియర్ విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు,

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *