-కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నోడల్ అధికారులు వారి సంబంధిత విధులపై నోడల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు, టైం లైన్ మేరకు పూర్తి సన్నద్ధతతో నిర్వహించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ నోడల్ అధికారులతో మాట్లాడుతూ ముందుగా ఈవిఎం సెకండ్ ర్వాండమైజేషన్ పక్కాగా చేపట్టాలని, అలాగే పీ.ఓ, ఎ.పీ.ఓ లకు, ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఏర్పాటుకు వెన్యూ, మాస్టర్ ట్రైనర్లను గుర్తించి పక్కాగా చేపట్టాలని సూచించారు. ఎన్నికల సామాగ్రి సంబంధించి పోలింగ్ సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ చేసేప్పుడు అందజేసే అంశాలు, పోలింగ్ అయిన తర్వాత రిసెప్షన్ కేంద్రంలో సమర్పించాల్సిన అంశాలకు చెక్ లిస్ట్ సిద్ధం చేసి దాని మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈవిఎం సెకండ్ ర్వాండమైజేషన్ మే 1 న ఆర్ఓ ల పరిధిలో జరగాలని, ఈవిఎం కమిషనింగ్ మే 3, 4 తేదీలలో నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. మార్క్డ్ ఎలక్టోరల్ రోల్ సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వీప్ కార్యక్రమ నిర్వహణ ప్రణాళికల మేరకు చేపట్టాలని సూచించారు. ఎపిక్ కార్డుల పంపిణీ పెండింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరాదని పూర్తి స్థాయిలో జరగాలని అన్నారు. ఈటిబిపీఎస్ సంసిద్ధంగా టైం లైన్ మేరకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధులు కేటాయించబడిన అధికారులు, అత్యవసర సేవల శాఖలు తదితరాలపై నిర్దేశిత షెడ్యూల్ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఈ నెల 24 తేదీ నాటికి అందేలా చూడాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ ప్లాన్ నోడల్ అధికారి తడ మండల పరిధిలోని ఇరకం దీవిలో కమ్యూనికేషన్ సక్రమంగా ఉండడానికి ప్రణాళికలు ఉండాలని అన్నారు. ఓటర్ హెల్ప్ లైన్, ఎన్జిఎస్పీ హెల్ప్ లైన్, సీ విజిల్ సకాలంలో హాజరు అవుతున్నామని అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా నోడల్ అధికారులు తదితరుల పాల్గొన్నారు.