చిన్న మద్యతరహ పరిశ్రమల యజమానులతో అత్మీయ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రాగానే చిన్న మద్యతరహ, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తూ వారికి అన్ని విధాలుగా ఆర్దికంగా అండగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు స్పష్టం చేశారు. శనివారం కొండపల్లి లోని ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీ (ఐడిఏ) వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చిన్న మద్యతరహ పరిశ్రమల యజమానులతో అత్మీయ సమావేశం లో పాల్గొన్నారు. ఈ సమావేశం లో ముందుగా పరిశ్రమల యజమానులు తమ సాధక బాధలు వివరించారు. అనంతరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు ప్రారిశ్రామిక వేతలతో మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం 50 కి పైగా పరిశ్రమలతో ఉన్న కొండపల్లి ఐడిఎ లో నేడు 20 పరిశ్రమలు కూడా పనిచేయడం లేదు. జగన్మోహనరెడ్డి ఐదేళ్ల పాలనలో ఆంధ్ర రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో నష్టపోయిందని తెలిపారు. ఆంధ్రపదేశ్ లో పరిశ్రమల ప్రోత్సాహకాలు లేకపోవడం, పవర్ సెక్టార్ పరిస్థితి రోజు రోజుకు అధ్వాన్నంగా ఉండటం తో రాష్ట్రంలో పరిశ్రమల పరిస్దితి చాలా దారుణంగా మారిందన్నారు. విజనరీ ఉన్న నాయకులు చంద్రబాబు పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో ముందుకు సాగుతుందని అందరం కలిసి ఎన్డీఏ కూటమి కి మద్దతు తెలిపి చంద్రబాబు కి మద్దతు తెలిపాలని విజ్ణప్తి చేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *