-రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల ప్రస్తావన
-బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై కృతజ్ఞతలు
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి కేటాయింపులు చేయడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు రాష్ట్రానికి చెందిన మంత్రి శ్రీనివాస వర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ లతో కల్సి సోమవారం ఆమె ప్రధానితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఈ సందర్బంగా చర్చించారు. స్టీల్ ప్లాంట్ తో పాటు అనేక ఇతర సమస్యలు రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను ప్రస్తావించారు. అలాగే గత ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో కూడా ప్రధానికి వివరించారు. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్‌లో కేటాయింపులు చేసి, మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసారు.