Breaking News

ఈ-పంట యాప్‌లో నమోదు ప్రక్రియ పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పెదకాకాని మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో ఎ.భార్గవ్‌ తేజ ఐఎఎస్‌, జాయింట్‌ కలెక్టర్‌, గుంటూరు వారు జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు వారితో కలిసి ఈ-పంట యాప్‌లో నమోదు ప్రక్రియను విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌ ఏ విధంగా చేస్తున్నారో అని శుక్రవారం రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడుతూ సాగుదారులను గుర్తించి టైమ్‌ లైన్‌ లోపల ఈ`పంట కార్యక్రమాన్ని ముగించాలని ఆదేశించారు. తదుపరి జాయింట్‌ కలెక్టర్‌ వారు అక్కడ ఉన్న రైతులతో మమేకమై ఈ-పంట యాప్‌లో వాస్తవ సాగుదారులు మరియు కౌలు రైతుల పేర్లను గుర్తించి పై పంట నమోదు చేయించుకోవాలని తెలిపారు. అలాగే తదుపరి పాక్స్‌, ఉప్పలపాడు ను సందర్శించి అక్కడ సిబ్బందితో సొసైటీ యొక్క రైతుల వివరాలు కంప్యూటరైజేషన్‌ ప్రక్రియ ఎక్కడ వరకు వచ్చిందని, వారు ఏ విధంగా యాప్‌నందు నమోదు చేయుచున్నారో అని దగ్గర ఉండి పరిశీలించారు. తదుపరి జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు వారు మాట్లాడుతూ విఎఎలు అందరూ క్రాప్‌ బుకింగ్‌ చేసే ముందు తప్పనిసరిగా గ్రౌండ్‌ ట్రూతింగ్‌ జరగాలని అనగా సర్వేనెంబర్‌ వారీగా పంట వేయని రికార్డ్స్‌, ల్యాండ్‌ కన్వర్జేషన్‌ అయినవి, నాన్‌ అగ్రికల్చర్‌ కింద ఉన్న సర్వే నెంబర్స్‌ని గుర్తించి రికార్డ్‌ చేసి పెట్టుకోవాలని దీనికి విఆర్వోలతో కోఆర్డినేట్‌ చేసుకొని డేటా సబ్మిట్‌ చేయాలని ఆదేశించారు.

Check Also

త్వరలోనే విశాఖపట్టణం, తిరుపతిలలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు

-సచివాలయంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *