Breaking News

దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో మహిళా పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకం

-చిన్న మధ్య తరహ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-మహిళా పారిశ్రామికవేత్తల కున్న సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించింది
-ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తల స్ఫూర్తికి ప్రభుత్వం మద్దతునిస్తుంది

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి చిన్న మధ్య తరహ పారిశ్రామిక రంగంలో మహిళల పాత్ర కీలకమని, పారిశ్రామిక రంగ స్వరూపాన్ని మార్చడంలో మహిళా పారిశ్రామికవేత్తల కున్న సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతుందని చిన్న మధ్య తరహ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. కె యల్ విశ్వవిద్యాలయంలో రెండు రోజులు జరుగుతున్న జాతీయ స్థాయి మహిళా మేధో సంపత్తి వ్యాపార సదస్సు- 2024ను మంత్రి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం సదస్సులో సభికుల నుద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తల స్ఫూర్తికి మద్దతునివ్వడమే కాకుండా, అనుగుణమైన వ్యవస్థను రూపొందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వ్యాపారంలో మహిళలకు సాధికారత కల్పించడం, వారికి అవసరమైన వనరులు, శిక్షణ మరియు ఆర్థిక సహాయాన్ని పొందేలా చేయడం కోసం రాష్ట్రప్రభుత్వం అనేక కార్యక్రమాలు, పథకాలను రూపొందిస్తుందని చెప్పారు. అడ్డంకులను ఛేదించడానికి, పోటీ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన సాధనాలను మహిళలకు అందించడానికి తమ వంతు ప్రయత్నం ఎప్పుడూ ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. వ్యాపార వాతావరణంలో మేధో సంపత్తి యొక్క ప్రాముఖ్యత, ప్రపంచీకరణ నేపధ్యంలో వ్యాపార విజయానికి కీలకమైన సాధనంగా ఉద్భవించిందని చెప్పారు. మహిళల నేతృత్వంలోని ఆవిష్కరణలను రక్షించడానికి, విలువను సృష్టించడానికి దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి మేదోసంపత్తిని అర్థం చేసుకోని ప్రోత్సాహాన్ని అందించటం కీలకమని తెలిపారు. మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున వినడానికి, నేర్చుకోవడానికి సాధ్యమైన ప్రతి విధంగా మీకు సహాయం చేయడానికే తమ ప్రభుత్వం ఉందన్నారు. మీ విజయమే మా విజయమని , మీ ఎదుగుదల దేశం యొక్క అభివృద్ధికి గీటురాయి అని అన్నారు. ఈ సమ్మిట్ గొప్ప విజయాన్ని సాధించాలని, వ్యవస్థాపక ప్రయాణంలో కొత్త శిఖరాలను చేరుకోవడానికి మీలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని, శక్తినివ్వాలని మంత్రి శ్రీనివాస్ ఆకాంక్షించారు. అనంతరం కె యల్ యూనివర్సిటీ ఇన్కుబేషన్ సెంటర్లో పలువురు రూపిందించిన నూతన ఆవిష్కరణలను మంత్రి పరిశీలించి కె యల్ యూనివర్సిటీ చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ సదస్సుల ఎలిప్ అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి, నారీ శక్తి అవార్డ్ గ్రహీత కనకాల రమాదేవి, కె యల్ యు కార్యద్ఫర్షి కోనేరు కాంచనలత, పారిశ్రామికవేత్త కె శేషుబాబు తదితరులు పాల్గొని సందేశానిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు ,కె యల్ యు సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *