-ఇన్సూరెన్స్ క్లెయిమ్ ద్వారా 1730.19 లక్షలు అందజేసాం- రవాణాశాఖ
-విజయవాడ; వరద ముంపుకు గురైన మోటార్ వాహనాలను రిపేర్లు చేసి త్వరగా బాధితులకు అందజేసే విధంగా రవాణాశాఖ చర్యలు తీసుకుంటుంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఉన్న రవాణా కమిషనర్ కార్యాలయం నుండి ఒక పత్రిక ప్రకటనను విడుదల చేసింది.
వరద ముంపుకు గురైన వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను త్వరగా పొందేందుకు రవాణాశాఖ పర్యవేక్షిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశాలు నిర్వహించి, సుమారు 4836 పాలసీదారులకు 1730.19 లక్షలను అందజేయడం జరిగింది. 65 సర్వీసింగ్ సెంటర్లలో 2258 వాహనాలు మరియు లోకల్ మెకానిక్‌ల సహాయంతో 4676 వాహనాలను రిపేర్ చేయించబడ్డాయి. వాహన రిపేర్లను త్వరగా పూర్తి చేసి యజమానులకు అందజేయడానికి రవాణాశాఖ కృషి చేస్తోంది. ఇతర జిల్లాల నుండి 67 మంది మోటార్ వాహన తనిఖీ అధికారులను విజయవాడకు రప్పించి, ప్రతి ఐదు సర్వీసింగ్ స్టేషన్లకు ఒక ఎం.వి. ఇన్స్పెక్టర్‌ను కేటాయించి వాహనాల రిపేర్లను వేగవంతం చేయిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరద ముంపులో చిక్కుకున్న ప్రజలకు ఆహారం అందించడం, మరియు సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో రవాణాశాఖ కీలక పాత్ర పోషించింది.