Breaking News

394 మంది వరద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.3 వేల ఆర్థిక సాయం అందజేత

-నిడదవోలు రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామంలో వరద బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి చెక్ అందించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
-ఇటీవల దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించిన నిడదవోలు మండలం ఉనకరమిల్లి గ్రామానికి చెందిన బొక్కా ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును బాధిత కుటుంబానికి అందించిన మంత్రి
-వ్యక్తిగతంగా బాధిత కుటుంబానికి రూ.25వేల ఆర్థిక సాయం అందించి పెద్ద మనసు చాటుకున్న మంత్రి దుర్గేష్
-రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా
-నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్వంలో జరుగుతున్న పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సీమంతాల కార్యక్రమానికి హాజరై మహిళలను ఆశీర్వదించిన మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు, వరదల ధాటికి సర్వస్వం కోల్పోయిన 394 మంది వరద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రూ.3వేల ఆర్థిక సాయాన్ని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందించారు. సోమవారం నిడదవోలు రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామంలో వరద బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి ప్రభుత్వం తరపున చెక్ లను అందించారు.

అదే విధంగా ఇటీవల దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించిన నిడదవోలు మండలం ఉనకరమిల్లి గ్రామానికి చెందిన బొక్కా ప్రసాద్ కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును బాధిత కుటుంబానికి మంత్రి అందజేశారు. అంతేగాక వ్యక్తిగతంగా బాధిత కుటుంబానికి మంత్రి దుర్గేష్ రూ.25 వేలు సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అభయమిచ్చారు. తమ వంతు సాయంగా అందజేసిన ఆర్థిక సాయం పిల్లలు చదువుకోవడానికి, కుటుంబానికి ఆసరాగా ఉంటుందని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఇటీవల ఎర్రకాలువ పొంగి పంట నష్టం సంభవించినప్పుడు, కొన్ని గ్రామాల్లో మోకాల్లోతు నీళ్లు వచ్చినప్పుడు తాము స్వయంగా పర్యటించామన్నారు. ప్రజల కష్టాలు కళ్లారా చూశామన్నారు. తొలుత ఎన్యూమరేషన్ చేసినప్పుడు 174 మందిని ఎంపిక చేశామని, అనంతరం కలెక్టర్ తో కలిసి మరో 220 మందిని ఎన్యూమరేషన్ జాబితాలో చేర్చి మొత్తం 394 మందికి బాధితులు నష్టపోయారని గుర్తించామన్నారు. ఒక గ్రామంలో ఇంచుమించు చాలా మందిని ఎంపికచేశామన్నారు. ఇటీవల జంగారెడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదంలో 7 మంది మృతి చెందగా, ఆయా బాధిత కుటుంబాలకు సత్వరమే ఎక్స్ గ్రేషియా అందించామని గుర్తుచేశారు.ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మేమున్నామని ఆదుకునే, భరోసానిచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్రం నుండి సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రజల వద్దకు కష్టం రానీయకుండా చూస్తున్నారన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ అందించామన్నారు. గత ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో చేయలేని పనులు కేవలం 100 రోజుల్లోనే కూటమి ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా తన కష్టార్జితం, సినిమాల ద్వారా సంపాదించిన సొమ్ము రూ.6 కోట్ల ఆర్థిక సాయం చేయడం గొప్ప విషయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అహర్నిశలు శ్రమించి విజయవాడ నగరాన్ని 9 రోజుల్లోనే యథాస్థితికి తీసుకురావడం మామూలు విషయం కాదన్నారు. నిడదవోలు నియోజకవర్గాన్ని అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు.

అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామంలో 1 సెప్టెంబర్ నుండి 30 సెప్టెంబర్ దాకా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్వంలో జరుగుతున్న పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన సీమంతాల కార్యక్రమానికి హాజరైన మంత్రి కందుల దుర్గేష్ మహిళలను ఆశీర్వదించారు.

కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూర్గుల శేషారావు, మండల తహసిల్దార్ బి నాగరాజు నాయక్, స్థానిక నాయకులు పి. వెంకటరత్నం, పాల వీరస్వామి, రమేష్, సతీష్, పి బాబి, కే సుబ్బారావు, కే నాగమణికంఠ, పి చిరంజీవి, ఎం ప్రసాద్, సర్పంచ్, పి శివరామకృష్ణ, బండి సత్యనారాయణ, సింగంశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి  కలెక్టరు ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *