-సంక్షేమం, అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వ నూరు రోజుల పాలన…
-నూజివీడు మండలంలో రూ.43.50 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి…
-నూజివీడు మండలంలోని పలు గ్రామాలలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి…
నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఘనమైన విజయాన్ని అందించారని ఈ విజయాన్ని కూటమి ప్రభుత్వం విజయంగా భావించకుండా బాధ్యతగా భావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు.
సోమవారం నూజివీడు మండలం సుంకొల్లు ,యనమందల,బత్తులవారి గూడెం గ్రామంలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి 100 రోజుల్లో ఎన్ .డి. ఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి వివరించారు. అక్కడ ప్రజల సమస్యలను మంత్రి పేరు పేరున అడిగి తెలుసుకున్నారు. నూజివీడు మండలంలో రూ. 43.50, లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పార్థసారథి శంఖుస్ధాపన చేశారు. నూజివీడు మండలం యనమందల గ్రామంలో రూ. 15 లక్షల తో నిర్మించే సిమెంట్ రోడ్డు, సుంకొల్లు గ్రామంలో రూ.7.50 లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డు, బత్తులవారిగూడెం లో రూ. 21 లక్షలతో నిర్మించే సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు తెలిపారు. 100 రోజులు పూర్తిచేసుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడిపిస్తూ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలచేత అనిపించుకుంటుందని తెలిపారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రాష్ట్రంలో 64 లక్షలు మంది సామాజికి పింఛన్ దారులకు 3 వేల రూపాయలు నుంచి 4 వేల రూపాయలకు పెన్షన్ పెంచడమే కాక 3 నెలల బకాయిలను కలిపి 7 వేలు రూపాయలు అందించామన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది వాలంటీర్లు రెండు మూడు రోజులు సామాజికి పెన్షన్లు పంపిణీ చేసేవారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం లక్షా ముప్పై వేల మంది సచివాలయాల సిబ్బందితో ఒకరోజులోనే పంపిణీ చేస్తున్నామన్నారు. పేదల ఆకలిని తీర్చేందుకు 5 రూపాయలకే నాణ్యమైన ఆహరం అందించేందుకు అన్నా క్యాంటిన్లను ప్రారంభించామన్నారు. అంతేకాక నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పనిజేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో 16 వేల 700 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ని ప్రకటించారని, దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ చేస్తామని, మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణం పథకంను అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పధంలో నడపడానికి గొప్ప విజన్ నాయకుడు పరిపాలన దక్షతకలిగి దూరదృష్టి ఉన్న నాయకుడు మనకు ముఖ్యమంత్రి గా ఉన్నందున అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం ముందుకు దూసుకెళుతుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కడే అని నమ్మి ప్రజలు రికార్డు స్థాయిలో సీట్లు అందించారన్నారు.
ఈ సందర్భంగా తనను కలిసి సమస్యలను తెలిపిన ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ నూజివీడు నియోజకవర్గంలో ఎక్కడా త్రాగునీరు సమస్య లేకుండా చూస్తానని, అవసరమైన ప్రదేశాలలో బోర్లు ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నూజివీడు నియోజకవర్గంలో గతంలో మూతపడిన పరిశ్రమలను త్వరలో పునప్రారంభించి తద్వారా మరింత మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.
సుంకొల్లు, యనమందల, బత్తులవారి గూడెం గ్రామాలలో పలు సమస్యలను గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకొని రాగా వెంటనే సమస్యలు పరిష్కరించమని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సుంకొల్లు గ్రామంలో త్రాగునీటి, సమస్య, డ్రైనేజీ సమస్య, సిసి రోడ్ల సమస్య మరియు సాగునీటి సమస్య విద్యుత్ స్తంభాల ,ఇండ్ల స్థలాల సమస్య,ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించిన మంత్రికి గ్రామస్తులు తమ హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు. యనమందలలో వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు, రోడ్లు, హరిజన వాడలో ఇళ్ల స్థలాలు, మురుగునీరు, దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులుకు మంత్రి ఆదేశించారు.
సుంకొల్లు గ్రామంలో ఉపాధిహామీ పనుల్లో అవకతవకలపై అరా తీయగా రూ. 24లక్షల నూజివీడు మండలంలోరూ. 64 లక్షల పక్కదారి పట్టినట్లు గమనించిన మంత్రి ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి ఫీల్డ్ అసిస్టెంట్ , ఇతర అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి నిధులు మొత్తం రికవరీ చేయాలని డ్వామా పిడి ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి ఆదేశించారు. గ్రామంలో జాబ్ కార్డు లేకుండా సంతకాలు లేకుండా డ్రా చేసిన నిధులు రికవరీ చేసి అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. గ్రామంలో పంచాయతీ సెక్రటరీ, ఎఎన్ఎం, విద్యుత్ లైన్ మేన్, తదితర సిబ్బంది, అధికారులందరూ అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
కార్యక్రమంలో తహశీల్ధార్, మండల అభివృద్ధి అధికారి, స్ధానిక నాయకులు గద్దె రఘు, ఎన్, వేణు, కె శ్రీను, ఎమ్ రాజా, ఎమ్ ఎన్ సత్యన్నారాయణ, ఎ సీతారామరాజు, పంచాయతీరాజ్ ,విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News