Breaking News

కాలువ గట్లను సుందరీకరిస్తాం… : క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాలవగట్లు మరియు పార్క్ లలో పచ్చదనo పెంపొందించి సుందరంగా ఆకర్షనియంగా తీర్చిదిద్దాలని న‌గర పాలక సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం క‌మిష‌న‌ర్ అధికారుల‌తో క‌లిసి గురునానక్ నగర్ కనకదుర్గ గేజిటెడ్ ఆఫీసర్ కాలనీ పార్క్, జాతీయ రహదారి కనకదుర్గమ్మ వారధి ప్రాంతములోని ధర్మచక్ర పార్క్ మరియు అదే ప్రాంతములోని కాలవగట్ల ప్రాంతాలను ప‌రిశీలించారు. ఆయా పార్క్ లలో చేపట్టిన గ్రీనరి మరియు ఇంజనీరింగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకొని అధికారుల‌కు పలు సూచనలు చేసారు. విధ్యధరాపురం లేబర్ కాలనీ పార్క్ నందలి గ్రీనరి అభివృద్ధి పనులు పరిశీలించి కాలవగట్ల యందు గ్రీన‌రీ పెంపుతో పాటుగా పార్క్ అభివృద్ది చేయ‌డం, చిన్నారులను ఆకర్షించే విధంగా బొమ్మలు మరియు అట పరికరాలు ఏర్పాటు చేయుట మరియు అవకాశం ఉన్న చోట్ల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయ‌ల‌న్నారు. ప‌ర్య‌ట‌న‌లో ఎస్.ఇ (ప్రాజెక్ట్స్) బి.నరసింహ మూర్తి, ఎస్.ఏ.(వర్క్స్) ఇన్ ఛార్జ్ వై.వి.కోటేశ్వరరావు, డిప్యూటీ సిటి ప్లానర్ జె.సూరజ్ కుమార్, ఉద్యానవనశాఖా అధికారి జె.జ్యోతి, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు

-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *