-నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని లోని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం వైఎస్ఆర్ కాపునేస్తం పథకం అమలు చేస్తోందని, కాపునేస్తం పథకం దరఖాస్తు గడువును ఈ నెల 9వ తేదీ వరకు పొడిగించిన్నట్లు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ ప్రకటనలో పేర్కొన్నారు. కాపునేస్తం అర్హలైన వారు అన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించడాన్ని మరో రెండు రోజులు పొడిగించినట్లు తెలిపారు. అన్ని వార్డ్ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శులు ప్రజల నుంచి దరఖాస్తులను అన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.