సచివాలయానికి వచ్చే సర్వీసులను గడువులోపు పరిష్కరించాలి…

-విజయవాడలో లోని 97,98 వార్డు సచివాలయాలను పరిశీలించిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయానికి వచ్చే సర్వీసులను గడువులోపు పరిష్కరించాలని సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ ఆదేశించారు. బుధవారం విజయవాడ లోని సెంట్రల్ మండలం 97,98 వార్డు సచివాలయాలను సబ్ కలెక్టర్ జి.సూర్య సాయి ప్రవీణ్ చంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని, ఒక్క సర్వీసును కూడా పెండింగ్ లో ఉంచరాదన్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు అవసరమైన సమాచారాన్ని వెంటనే అందించాలని, ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ సేవల కోసం సచివాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సచివాలయ సేవలు ఎలా అందుతున్నాయో ఆయన అరా తీశారు. అనంతరం సచివాలయానికి ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను సచివాలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల పోస్టర్ లను, లబ్ధిదారుల జాబితాను సబ్ కలెక్టర్ పరిశీలించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

4వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంక్ ఉంది

-పామాయిల్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నాం -త‌ల‌స‌రి ఆదాయం రూ.4ల‌క్ష‌ల‌కుపైగా సాధాన ల‌క్ష్యం -ఏలూరు జిల్లా క‌లెక్ట‌ర్ వెట్రిసెల్వి అమ‌రావ‌తి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *