Breaking News

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

-జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్

పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
గోరంట్ల మండలం గంగంపల్లి మజరా దిగువ గంగంపల్లి తండాలో ఆదివారం పిడుగుపాటుకు ఒకే కుటుంబం లో ఇద్దరు మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, గోరంట్ల తాసిల్దార్ మారుతి, సీఐ శేఖర్,. పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో జరిగిన వాస్త వాలపై నివేదికను అందజేయాలని ఆదేశించారు. అలాగే సంఘటనలో గాయపడిన వ్యక్తిని వైద్య చికిత్స నిమిత్తం తీసుకెళ్లవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో పిడుగుపాటు కు దశరథ్ నాయక్ (48) దేవి బాయి (45) గురై మరణించడం జరిగింది. వీరి కుమారుడు జగదీష్ నాయక్ (27) గాయాల పాలవడంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలించారు. జిల్లా కలెక్టర్ కు అధికారులు సమర్పించిన నివేదిక తదనంతరం జిల్లా కలెక్టర్ ప్రభుత్వపరంగా కుటుంబాలను ఆదుకుంటామని మృతులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా కొరకు ప్రభుత్వానికి సిఫారసు చేయడం జరుగుతుందని గాయపడిన వ్యక్తికి రూ.50, 000లు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. అలాగే ఇదే సంఘటనలో మృత్యువు వాతకుగురిఐన అయిన 2 ఆవులు కూడా మరణించడం జరిగింది. చనిపోయిన ఒక్కొక్క ఆవుకు రూ.37,500 చొప్పున అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. బాధిత కుటుంబాలకు కలెక్టర్ తన సంతాపాన్ని తెలియజేశారు. ప్రభుత్వపరంగా అవకాశాలు ఉన్న మేరకు కుటుంబాలను ఆదుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.

Check Also

ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి  కలెక్టరు ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *