Breaking News

నగరంలో హై లైఫ్ ఎగ్జిబిషన్ ప్రారంభం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని నోవాటెల్ లో హై లైఫ్ ఎగ్జిబిషన్ మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హైలైఫ్ ఎగ్జిబిషన్స్ ఎండి & సీఈఓ అబి పి డొమినిక్ మాట్లాడుతూ” అతిపెద్ద ఎగ్జిబిషన్లలో హై లైఫ్ ఒకటి. వెడ్డింగ్ ఫ్యాషన్స్, జ్యువెలరీ, బ్రైడల్ ఫ్యాషన్ అవసరాలతో పాటుగా లైఫ్ స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శించనున్నామన్నారు. ఫ్యాషన్ డిజైనర్ల నుండి తాజా కలెక్షన్, ఫ్యాషన్ లేబుల్లు కూడా ప్రదర్శించనున్నాము” అని అన్నారు.ఫ్యాషన్ షాపింగ్, ఎక్స్ క్లూజివ్ వెడ్డింగ్ షాపింగ్, బ్రైడల్ ఫ్యాషన్లు, జ్యువెలరీ, ఫ్యాషన్ & లైఫ్ స్టైల్ ఉత్పత్తుల కోసం రెండు రోజుల “హైలైఫ్ ఎగ్జిబిషన్” 1వ & 2 అక్టోబర్, 2024 న నోవాటెల్ విజయవాడ వరుణ్ లో నిర్వహించబడుతుందని వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరం

-లక్షల ఖర్చుతో చేస్తున్ననగర సుందరీకరణకు పోస్టర్స్ తో చేటు -పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ -నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *