విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో శత చండీ హోమం, రుద్రాభిషేకం అత్యంత వైభవంగా సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్ మొగల్రాజపురం నందు జగద్గురువుల వారి ఆశీస్సులతో అక్టోబర్ 3 నుంచి 12 వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరుపుటకు నిర్ణయించినట్లు కమిటీ చైర్మన్ సి ఎ సుంకర అక్కయ్య నాయుడు తెలిపారు. మంగళవారం సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా మహోత్సవాల విషయంలో దేశంలోనే విజయవాడ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నదని ఆ ప్రాముఖ్యతను మరింత పెంపొందించటానికి దేవీ శరన్నవరాత్ర కమిటీ ద్వారా అనేక ఆద్యాత్మిక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ఈ దసరా మహోత్సవాల్లో భాగంగా శతచండీ హోమం, శాంతి కల్యాణం, కుంకుమార్చన, సామూహిక లలితా సహస్రనామ పారాయణం, దశవిదహారతులు నిర్వహిస్తున్నట్లు ఇందులో భక్తులెల్లరు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు. వైస్ చైర్మన్ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ దేవీశరన్నవత్రి ఉత్సవ కమిటీ విజయవాడ ఆద్వర్యంలో చేపడుతున్న ఈ దసరా మహోత్సవాలు విజయవాడ కు మంచి ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తుంది అని సామాన్య భక్తులు సైతం చండీ హోమం, కుంకుమార్చన లాంటి మహోన్నత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కమిటీ వారు ఏర్పాటుచేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ జనరల్ సెక్రటరీ వైట్ల కృష్ణ పసన్న, కార్యక్రమ బ్రహ్మ రాళ్ళపల్లి పవన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొల్లి హారిక, కార్యవర్గ సభ్యులు చారుగుండ్ల రమేష్ బాబు మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News