Breaking News

గాయత్రీ ర్యాంపు ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారుల బృందం

-జెసి చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గాయత్రి 1 , 2 , 3 ర్యాంపుల్లో ఇసుక రవాణా ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించి బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులతో చర్చించి మరింత సమర్థవంతంగా రవాణా కార్యకలాపాలు నిర్వహించాలని కోరడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక గాయత్రి ర్యాంపులని సమన్వయ శాఖల అధికారులతో కలిసి జెసి పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ గాయత్రి ర్యాంపుల పరిధిలో అనుమతి మేరకు ఇసుక రవాణా చేపట్ట వలసి ఉంటుందన్నారు. ఈరోజు సుమారు 15 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను రవాణా చేయడం జరిగిందని బోట్స్ మ్యాన్ సొసైటి సభ్యులు జెసి కి వివరించారు. ఈ ర్యాంపు ల పరిథిలో సుమారు రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక లభ్యత అవుతుందని అధికారులు తెలిపారు. ఇసుక రవాణా ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేపట్టాలని, ప్రతిరోజూ ఇసుక రవాణా సామర్ధ్యం పెంచుకునేందుకు తగు చొరవ చూపాలని అధికారులను ఆదేశించారు. ఆమేరకు బోట్స్ మ్యాన్ సభ్యుల ద్వారా ఇసుక త్రవ్వకాలలో తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుందన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్డిఓ ఆర్ కృష్ణ నాయక్, మైన్స్ ఏడి డీ.. ఫణి భూషణ్ రెడ్డి, గోదారి రిజర్వ కన్సర్వటర్ ఈ ఈ. ఆర్. కాశీ విశ్వేశ్వరరావు, అర్బన్ తహసిల్దార్ పీ. హెచ్ . పాపా రావు, డీఈ లు, ఏఈలు, బోట్స్ మ్యాన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *