రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రతినియోజకవర్గంలో డాక్టర్ వైస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు…

-రైతులకు అందుబాటులే ఆర్బీకే కేంద్రాలు.. గ్రామ సచివాలయాలు.
-విత్తనాలు, ఎరువులు,పురుగు మందులు నాణ్యత నిర్ధారణ కొరకు అగ్రి ల్యాబ్ల్ లు
-రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)

గుడ్లవల్లేరు (వడ్లమన్నాడ), నేటి పత్రిక ప్రజావార్త :
రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతులు నకిలీ విత్తనాలు, ఎరువులు,పురుగుమందుల బారిన పడి నష్టపోకుండా అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) అన్నారు. గురువారం గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడ గ్రామంలో 21.80 లక్షలతో నిర్మించి ఆర్బీకే, రూ. 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాలను జాయింట కలెక్టరు మాధవీలత, గ్రామ సర్పంచ్ కటికల జ్యోతి లత తో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా రూ. 25 లక్షల విలువ గల వ్యవసాయ యంత్ర పరికరాలు అగ్రి మల్టీక్రాఫ్ మిషన్, కల్టివేటర్, రొటేటర్లు, గడ్డి చుట్టలు చుట్టే మిషన్, విత్తనాలునాటే మిషన్లు, స్పైయిర్లు రైతులకు అందజేసారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రైతులు వారి గ్రామాల్లోనే తమ సమస్యలను పరిష్కరించుకునే దిశగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఎలువులు విత్తనాలు, పురుగు మందులు అందజేస్తున్నారన్నారు. గ్రామంలో సచివాలయం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకొనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆర్బీకేలు, సచివాలయ వ్యవస్థను స్థాపించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రైతులకు మేలు చేసేందుకు ఒక అడుగు వేస్తే తండ్రి కంటే మిన్నగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పది అడుగులు వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లతో రాష్ట్రంలో నాణ్యమైన పంటలు ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందుతాయన్నారు. అంతేకాక రైతాంగం నష్టాలబారిన పడకుండా రక్షించవచ్చన్నారు.
గుడివాడ పట్టణంలో పేదలకు ఇళ్లు అందించే దిశగా 250 భూసేకరణచేశామన్నారు. మద్యతరగతి ప్రజల ఇళ్ల స్థలాల కొరకు మరో 400 ఎకరాలు భూసేకరణ చేస్తున్నాన్నామన్నారు. ఇప్పటికే జాయింట్ కలెక్టరు మాధవీలత రైతులతో పలు మార్లు చర్చించారన్నారు. గుడివాడ నియోజక వర్గంలో 74 గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం పథకాలను ప్రజలకు వారి గ్రామాల్లో అందిస్తున్నామన్నారు. గ్రామ స్థాయిలోనే పరిపాలనను సాగించే విధంగా ఆర్బీకే, సచివాలయాలు, అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లను అందుబాటులోకి ప్రభుత్వం తెచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు అత్యంత ప్రాధాన్యత నిస్తూ 50 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను ప్రతి అధికారి పాటిస్తూ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళుతూ మంచి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా వడ్లమన్నాడ గ్రామానికి చెందిన పశుపోషకులు నత్తా శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు కె. మాధవీలత, వడ్లమన్నాడ సర్పంచ్ కటికల జ్యోతి లత, ఆర్డీవో శ్రీనుకుమార్, తాహశీల్థారు ఆంజనేయులు, యంపీడీవో మణికుమార్, వైసీసీ రాష్ట్రస్థాయి నాయకు దుక్కిపాటి శశి భూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

స్వచ్చత హి సేవాలో భాగంగా ఆదివారం(22వ తేదీ) సైక్లోథాన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చత హి సేవాలో భాగంగా నగర ప్రజలకు స్వచ్చతపై అవగాహన కల్పిస్తూ, వారిని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *