-జాయింట్ మాధవీలతకు శ్రీ కొండాలమ్మ వారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న ఆలయ ఈవో…
గుడ్లవల్లేరు(వేమవరం), నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానాన్ని జాయింట్ కలెక్టరు( రెవెన్యూ) కె. మాధవీలత తో కలిసి రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) గురువార సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ కొండాలమ్మ అమ్మవారికి మంత్రి కొడాలి నాని, జాయిట్ కలెక్టరు మాధవీలత ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. శ్రీ కొండాలమ్మ దేవస్థానం చరిత్ర, ఆలయంలో జరుగుతున్న పూజలు, ఆలయ అభివృద్ధికి సంబంధించి తీసుకుంటున్న చర్యలను మంత్రి కొడాలి నాని జాయిట్ కలెక్టరు కు వివరించారు. అనంతరం శ్రీ కొండాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ ఈవో బహూకరించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముగం,ఆర్డీవో శ్రీనుకుమార్, తాహశీల్థారు ఆంజనేయులు, యంపీడీవో మణికుమార్, వైసీసీ రాష్ట్రస్థాయి నాయకు దుక్కిపాటి శశి భూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.