అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహనేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పుట్టిన రోజు ను రైతు దినోత్సవం గా జరుపుకోవడం సంతోషకరమని శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ అవరణలో రూ 65 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వై యస్ ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను గురువారం అధికారులు రైతులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ప్రారంభించారు. అనంతరం రైతులకు సబ్సిడీ పై మంజూరైన వ్వవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమం లో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు మాట్లాడుతూ మహనేత పుట్టిన రోజున రైతు దినోత్సవం జరుపుకోవడం అ మహనీయినికి మనం ఇచ్చే నిజమైన నివాళులని తెలిపారు. రైతుల సంక్షేమమే తన ధ్యేయంగా పనిచేసిన మహనేత అశయాలను యువనేత జగన్మోహనరెడ్డి కోనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఓటమి ఎరుగని కుటుంబం వైయస్ఆర్ కుటుంబమని తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ సిఇఓ సూర్య ప్రకాశరావు , యార్డ్ చైర్మన్ పామర్తీ శ్రీనివాసరావు, మాజీ యార్డ్ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి, మాజీ యంపీపీ జోన్నలగడ్డ గంగాధరరావు, మాజీ జెడ్పీటిసి సభ్యులు కాజా బ్రహ్మయ్య, వ్వవసాయ శాఖ ఎడిఎ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ రోహిణిదేవి స్థానిక నాయకులు అధికారులు, రైతులు పాల్గొన్నారు
Tags AMARAVARTHI
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …