Breaking News

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకే అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లు..

-గుడివాడ నియోజవర్గంలో 97 లక్షలతో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభించిన ..
-రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు అగ్రి టెస్టింగ్ ల్యాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసారని రాష్ట్ర వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ. 97 లక్షల రూపాయల తో నిర్మించిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ఆయన మార్కెట్ యార్డు చైర్ పరస్ మొండ్రు సునీత, ఏడీఏ రమాదేవి స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కారణంగా రైతాగం పంటి దిగుబడి సమయంలో అధిక నష్టాలకు గురవుతున్నారన్నారు. ఈ సమస్యకు పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో సమీకృత అగ్రి ల్యాబ్ లను ఏర్పాటు చేసిందన్నారు. ఈ ల్యాబ్ లలో వ్యవసాయం, ఉద్యానవనాలు, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ , తదితర వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబందించిన వాటిని పరీక్షించడం జరుగుతుందన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను పరీక్షించి వాటిలో నకిలీలను గుర్తించి రైతులను అప్రమత్తం చేస్తారన్నారు. అంతేకాక భూసార పరీక్షలు చేసి, భూమిలో సూష్మపోషకాల కొరతను తెలియజేయడం జరుగుతుందన్నారు. ఏయే భూముల్లో ఎటువంటి పంటిలు వేయాలనేది అగ్రి ల్యాబ్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఉద్యానవన పంటలకు, మత్స్య సంపదకు సంబంధించి వినియోగించే సీడ్, మందులు, వాటికి సోకే వ్యాధులను గురించి కూడా పరీక్షించి తెలియజేస్తారన్నారు. అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లతో రాష్ట్రంలో నాణ్యమైన పంటలు ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందుతాయన్నారు. అంతేకాక రైతాంగం నష్టాలబారిన పడకుండా రక్షించవచ్చన్నారు. నియోజకవర్గ స్థాయిలో పరీక్షించిన నమూనాలను కొడింగ్ సెంటర్లలలో మరో సారి పరీక్షించి నిర్థారించడం వలన స్పష్టమైన నాణ్యత తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా ఫీడ్, వాటర్ అండ్ సాయిల్, మైక్రో బయాలజీ ప్రయోగశాల గదులను ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ప్రయోగశాలల్లో ఏర్పాటు చేసిన యంత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గుడివాడ మండలం కు చెందిన ఇద్దురు ఆదర్శ రైతులు ఇలపర్తి జయరామ్ ఉత్తమ పశుపోషక పురస్కారంతో పాటు రూ. 5 వేల రూపాయల నగదు, ధ్రువపత్రం, శాలువాతో ఘనంగా సత్కరించగా, వ్యవసాయ శాఖ తరపున ఆదర్శ రైతుగా కళ్లే పల్లి శంకరరావు సత్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ రమాదేవి, పశు సంవర్థక శాఖ వైద్యులు హనుమంతరావు, పట్టణ వైసీపీ అధ్యక్షులు గొర్ల శ్రీను, గుడివాడ రూరల్ మండలం వైసీపీ అధ్యక్షలు జాన్ విక్టర్ ,స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *