Breaking News

రాష్ట్ర పండగగా వాల్మీకి జయంతి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఆదేశం
-అన్ని జిల్లాలోనూ…కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహణ
-రాష్ట్ర స్థాయిలో అనంతపురంలో పకగ్బందీగా నిర్వహించాలన్న మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 17వ తేదీన వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్.సవిత ఆదేశించారు. అన్న జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో అనంతపురంలో వాల్మీకి జయంతిని నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని స్పష్టంచేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో ఉన్న తన కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, ఆ శాఖాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా, అధికారికంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబనాయుడు ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్ల నేతృత్వంలో వాల్మీకి జయంతి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు కలెక్టర్లకు ఆదేశాలు జారీచేయాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ ను మంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో వాల్మీకి జయంతిని అనంతపురంలో అదే రోజు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు భారీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆనందోత్సవాల నడుమ వాల్మీకి జయంతి నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ మాట్లాడుతూ, వాల్మీకి జయంతిని అధికారికంగా నిర్వహించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేయనున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *