Breaking News

సీఎంఆర్ఎఫ్ కు రూ.3.50 లక్షల విరాళం

-సీఎం చంద్రబాబుకు అందజేసిన మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం నిమిత్తం పెనుకొండ నియోజక వర్గ దాతలు అందజేసిన రూ.3.50 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత అందజేశారు. ఈ మేరకు గురువారం మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం చంద్రబాబునాయుడుకు మంత్రి చెక్ లను అందజేశారు. పెనుకొండ పట్టణానికి చెందిన ప్రగతి, రేవతి, బాబా ఫక్రూద్దీన్, దాదా పీర్, బాబా మహిళా గ్రామ సమాఖ్యల్లోని సభ్యులు అందజేసిన రూ.1.50 లక్షలు, బూదిలి గ్రామానికి చెందిన భ్రమరాంభిక మహిళా సంఘ సభ్యులు ఇచ్చిన రూ.50 వేలు, ఆంధ్రప్రదేశ్ బ్యాంకు రిటైరీస్ ఫెడరేషన్ రూ.లక్ష, పరిగి మండలకేంద్రానికి చెందిన ఇటుక బట్టీ యజమానులు రూ.50 వేలు… ఇలా మొత్తం రూ.3.50 లక్షలను సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ…విజయవాడ వరద బాధితులను ఆదుకోడానికి ముందుకొచ్చిన పెనుకొండ నియోజక వర్గానికి చెందిన దాతలను అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరికొందరు దాతలు బాధితులను ఆదుకోడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *