-ఈనెల 14 15 తేదీల్లో విజయనగరంలో జరిగే పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రండి
-ముఖ్యమంత్రి క్యాబినెట్ మంత్రులందరినీ ఆహ్వానించిన మంత్రి కొండపల్లి,ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే అధితి గజపతి రాజు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 14 15 తేదీలల్లో విజయనగరంలో జరిగే పైడితల్లి అమ్మవారి తోల్లేళ్లు, సిరిమానోత్సవం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోపాటు క్యాబినెట్ సహచరులు అందరినీ ఆహ్వానిస్తూ వారికి రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయనగరం యంపి, ఎమ్మెల్యే కలిశెట్టి అప్పలనాయుడు, పూసపాటి అధితి విజయలక్ష్మి గజపతిరాజు ఆహ్వాన పత్రికలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను రాష్ట్ర పండుగ గుర్తించిన నేపథ్యంలో అధికారికంగా మొట్టమొదటిసారిగా రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా జరుపుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని క్యాబినెట్ సహచరులను అందరినీ రావాల్సిందిగా మంత్రి, స్థానిక యంపి, ఎంఎల్ఏ కోరారు. ఈరోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్థానిక ఎంపీ కలిసేటి అప్పలనాయుడు విజయనగరం శాసనసభ్యులు విజయలక్ష్మి గజపతిరాజు లతో కలిసి మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఉత్తరాంధ్రలో అతిపెద్ద పండుగైన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News